Asianet News TeluguAsianet News Telugu

రాజంపేట ఎమ్మెల్యే మేడా నివాసం వద్ద కలకలం: తుపాకీతో తిరుగుతున్న ఐదుగురి అరెస్ట్

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఇంటి వద్ద గురువారం నాడు ఐదుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  మరో ముగ్గురు పారిపోయారు. పారిపోయిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

kadapa police arrested five persons near Rajampet mla house mallikarjuna lns
Author
Amaravathi, First Published Sep 24, 2020, 11:20 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాజంపేట: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఇంటి వద్ద గురువారం నాడు ఐదుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  మరో ముగ్గురు పారిపోయారు. పారిపోయిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రాజంపేట ఎమ్మెల్యే మల్లిఖార్జున్ రెడ్డి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిపై స్థానికులకు అనుమానం వచ్చింది.ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఐదుగురు అనుమానితులను తమ అదుపులోకి తీసుకొన్నారు.

ఈ ఐదుగురు అనంతపురం లేదా పులివెందుల ప్రాంతానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. అనుమానితుల  వద్ద తుపాకీని కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అనుమానితులు ఎవరు.. వారి వద్ద తుపాకీ ఎందుకు ఉంది. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఎందుకు అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే విషయమై పోలీసులు  విచారిస్తున్నారు.

ఈ ఐదుగురు అనుమానితులను పోలీసులు అన్ని కోణాల్లో ప్రశ్నించనున్నారు. మరో వైపు పారిపోయిన ముగ్గురు కూడ ఏ ప్రాంతానికి చెందినవారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. పారిపోయిన వారిని పట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా ఎందుకు ఈ ప్రాంతంలో తిరిుగుతున్నారనే విషయమై పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios