Asianet News TeluguAsianet News Telugu

వివేకా కేసు.. ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా, పులివెందులకు చేరుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి

వైఎస్ వివేకాందరెడ్డి కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసిన నేపథ్యంలో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి తన స్వగ్రామం పులివెందులకు చేరుకున్నారు.

kadapa mp ys avinash reddy reached pulivendula ksp
Author
First Published Apr 25, 2023, 3:47 PM IST

వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన స్వగ్రామం పులివెందులకు చేరుకున్నారు. వైఎస్ వివేకాందరెడ్డి కేసులో ఆయన అభియోగాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డిని గడిచిన కొద్దిరోజులుగా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ నెల  16వ తేదీన అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్  చేశారు. దీంతో  ఈ నెల  17న తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు  చేశారు.  ఈ  పిటిషన్ పై  ఈ నెల  17, 18 తేదీల్లో  తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ముందస్తు బెయిల్  పై మధ్యంతర   ఉత్వర్వులు  జారీ చేసింది.  ఈ నెల  25వ తేదీన  ఈ విషయమై  తుది తీర్పును  ఇవ్వనున్నట్టుగా  తెలంగాణ హైకోర్టు ఆదేశాలు  ఇచ్చింది. అయితే  తెలంగాణ హైకోర్టు ఆదేశాలను  సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి  సవాల్  చేశారు. ఈ మేరకు  ఈ నెల  20న  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.

ALso Read: వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ : విచారణ రేపటికి వాయిదా

ఈ పిటిషన్‌పై ఈనెల 21న  సుప్రీంకోర్టు  సీజేఐ ధర్మాసనం  విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన  ముందస్తు బెయిల్ పై  స్టే ఇచ్చింది. ఈ నెల  24 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్  చేయవద్దని  సీబీఐని  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై ఈ నెల  24న  సుప్రీంకోర్టు విచారించింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై   హైకోర్టు  ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది.  మరో వైపు  ముందస్తు బెయిల్ పై   తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో అరెస్ట్ చేయవద్దని  వైఎస్ అవినాష్ రెడ్డి  తరపు లాయర్ల వినతిని  సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios