కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  ముందస్తు  బెయిల్ కోరుతూ  వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు  బెయిల్  పిటిషన్ దాఖలు  చేశారు. 


హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారంనాడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇటీవల కాలంలో వరుసగా విచారిస్తున్నారు. తనను లక్ష్యంగా చేసుకుని సీబీఐ అధికారులు విచారణ చేయడాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి తప్పు బట్టారు. ఉద్దేశ్యపూర్వకంగా సీబీఐ అధికారులు తనను ఈ కేసులో విచారిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య అంశం ఈ కేసులో ప్రధానం కానుందని ఆయన ఆరోపించారు.

ఈ కేసులో తనను అరెస్ట్ చేయవద్దని వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈ నెల 17న తోసిపుచ్చింది. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించుకోవచ్చని సీబీఐని ఆదేశించింది హైకోర్టు .దరిమిలా ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి.

also read:అరెస్ట్ చేయవద్దని చెప్పలేం: వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

ఈ నెల 14న సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్ సహా కొందరు వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో ఆశ్రయం పొందారని సీబీఐ ఆరోపణలు చేస్తుంది. ఈ విషయమై సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డి , ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఆశ్రయం పొందారనే ఆరోపణలను అవినాష్ రెడ్డి తోసిపుచ్చుతున్నారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలను సీబీఐ విచారిస్తుందని అవినాష్ రెడ్డి మండిపడుతున్నారు. ఈ కేసు విచారణ సుదీర్థంగా సాగడంపై సుప్రీంకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ ఆలస్యం కావడంపై సుప్రీంకోర్టు మండిపడింది