వైఎస్ వివేకా హత్య కేసు: ఐదోసారి సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఇవాళ  సీబీఐ విచారణకు  హాజరయ్యారు.  ఐదో దఫా  సీబఐ విచారణను  వైఎస్ అవినాష్ రెడ్డి  ఎదుర్కొంటున్నారు. 

Kadapa  MP  YS Avinash Reddy  Appears  Before CBI   Investigation   lns

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి  బుధవారంనాడు  సీబీఐ విచారణకు  హాజరయ్యారు.  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  ఐదోసారి  వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణు  ఎదుర్కొంటున్నారు.  గతంలో  నాలుగు దఫాలు  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు  హాజరయ్యారు.

వాస్తవానికి ఈ నెల  17న వౌైఎస్ అవినాష్ రెడ్డి  సీబీఐ విచారణకు  హాజరు కావాల్సి ఉంది.  అయితే  ఈ కేసులో   వైఎస్ అవినాస్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.    ఈ పిటిషన్ పై  హైకోర్టులో  విచారణ  సాగుతున్న సమయంలోనే  ఈ నెల  17న మధ్యాహ్నం   3 గంటలకు  సీబీఐ కార్యాలయానికి వైఎస్ అవినాష్ రెడ్డి  చేరుకున్నారు.

 సీబీఐ విచారణ  అంశాన్ని  హైకోర్టు ముందు  అవినాష్ రెడ్డి తరపు  న్యాయవాది  కోర్టు దృష్ికి తీసుకు వచ్చారు. అయితే  ఈ నెల  17న  సాయంత్రం ఐదు గంటల తర్వాత  విచారిస్తామని  సీబీఐ  అధికారులు  కోర్టుకు తెలిపారు.  కానీ  ఈ నెల  18న  ఉదయం  10:30 గంటలకు  విచారణకు  రావాలని   సీబీఐ నోటీసులు  జారీ చేసింది. అయితే  ఈ నెల  18వ తేదీ సాయంత్రం నాలుగు  గంటల తర్వాత  విచారించాలని హైకోర్టు  సీబీఐకి సూచించింది. వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ  ఉన్న కారణంగా   సాయంత్రం  విచారించాలని హైకోర్టు  సూచించింది.  ఈ సూచన మేరకు  ఈ నెల  18 సాయంత్రం విచారణకు రావాలని  అవినాష్ రెడ్డికి  సీబీఐ సూచించింది.  

ఈ నెల  18వ తేదీ  మధ్యాహ్నం  ఒంటి గంట  నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు  వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో  విచారణ  జరిగింది, ఈ విచారణ సమయంలో  సీబీఐ విచారణ అంశాన్ని  హైకోర్టు ముందు  అవినాష్ రెడ్డి  తరపు న్యాయవాది ప్రశ్నించారు.  ఈ కేసు విచారణ అధికారి  కోర్టులో  ఉన్న సమయంలో  ఎవరు  విచారిస్తారని  హైకోర్టు  ప్రశ్నించింది.  దీంతో  ఈ నెల  19న ఉదయం పది గంటలకు  విచారిస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది.  ఇదే విషయమై  వైఎస్ అవినాష్ రెడ్డి కి నిన్న  సాయంత్రం  నోటీసులు  పంపారు.  ఈ నోటీసుల ఆధారంగా  ఇవాళ  వైఎస్ అవినాష్ రెడ్డి  సీబీఐ  విచారణకు  హాజరయ్యారు. 

also read:నేటి విచారణకు బ్రేక్, రేపు విచారణకు రావాలి:వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీస్

ఇదిలా  ఉంటే  ఈ నెల  25వ తేదీ వరకు   వైఎస్ అవినాష్ రెడ్డిని  అరెస్ట్  చేయవద్దని  నిన్న  తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.   విచారణ సమయంలో  ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది.  లిఖితపూర్వకంగా  ప్రశ్నలు ఇచ్చి విచారించాలని   కూడా  హైకోర్టు ఆదేశించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios