Asianet News TeluguAsianet News Telugu

175ఏళ్ల ఆచారాన్ని గౌరవిస్తూ...ఆ భూమిని కాపాడండి: గ్రామస్తుల వేడుకోలు (వీడియో)

దాదాపు 175 సంవత్సరాల క్రితం నుండి దేవర ఇల్లు గుడి పూజిస్తున్నామని... ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన భూమిని దేవుని మాన్యం గా గుర్తించి కాపాడాలంటూ పాపన్న గారిపల్లి గ్రామస్తులు ప్రభుత్వాన్ని, దేవాదాయ అధికారులకు కోరుతున్నారు. 

Kadapa district papannagaripally villagers protest  akp
Author
Kadapa, First Published Sep 20, 2020, 11:57 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కడప జిల్లా సంబేపల్లి మండలం పాపన్న గారిపల్లి గ్రామస్తులు తమ ఇష్టదైవానికి సంబంధించిన భూమిని కాపాడాలంటూ ఆందోళనకు దిగారు. దాదాపు 175 సంవత్సరాల క్రితం నుండి దేవర ఇల్లు గుడి పూజిస్తున్నామని... ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన భూమిని దేవుని మాన్యం గా గుర్తించి కాపాడాలంటూ గ్రామస్తులు ప్రభుత్వాన్ని, దేవాదాయ అధికారులకు కోరుతున్నారు. 

పాపన్నగారి పల్లిగ్రామం సర్వేనెంబర్ 6ఆ లో 5 ఎకరాల 19 సెంట్లు భూమి నందు దేవర్ ఇంటికి సంబంధించిన ఇద్దరు పూజారులు, ఆరు దేవర ఎద్దుల సమాధులు వున్నాయి. అయితే వీటిని మూడు తరాల నుంచి ఈ సమాధులకు గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు. కానీ ఇటీవల ఈ భూమిని ఇటీవల అధికారుల అండబలం,  రాజకీయ పలుకుబడితో స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 

వీడియో

"

తమ ఆచారాలను గౌరవించి నాలుగు గ్రామాలను కాపాడుతూ వస్తున్నటువంటి దైవానికి సంబంధించిన భూమిని కాపాడాలని వేడుకున్నారు. ప్రభుత్వాధికారులు కలుగచేసుకుని తాము పూజించేటువంటి జీవ సమాధులు కలిగిన ఈ భూమిని దేవుని మాన్యం గానే ఇవ్వాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios