మాతో టచ్ లో టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలు... చంద్రబాబు పని అయిపోయినట్లే..: కేఏ పాల్ (వీడియో)
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వందకు వందశాతం అవినీతిపరుడని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

విశాఖపట్నం : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. అత్యంత అవినీతిపరుడైన చంద్రబాబును అరెస్ట్ చేయడం మంచి పరిణామమని అన్నారు. వందకు వందశాతం ఆయన అవినీతి చేసాడన్నారు. అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబును మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ తో... లోకేష్ ను భగత్ సింగ్ తో కొందరు పోలుస్తున్నారని... ఇది చాలా దారుణమని పాల్ అన్నారు.
చంద్రబాబును గురించి తనకు బాగా తెలుసని... గతలో ఆయన తన శిష్యుడేనని పాల్ పేర్కొన్నారు. అధికారంలో వుండగా అవినీతి, అక్రమాలకు పాల్పడి... ఇప్పుడు అరెస్ట్ చేస్తే గగ్గోలు పెడుతున్నాడని... ఈయనను ప్రజలు నమ్మడం లేదన్నారు. టిడిపిలో అరవై లక్షల మంది సభ్యులు వున్నారంటూ చంద్రబాబు ఎప్నుడూ చెబుతుంటారు... కానీ ఆయనను అరెస్ట్ చేసినందుకు చేపట్టిన ఏపీ బంధ్ లో కనీసం ఆరు వందల మంది కూడా రోడ్లమీదకు రాలేదన్నారు. ఓ వందమంది రోడ్డుపైకి వచ్చారని... వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ గా పాల్ పేర్కొన్నారు.
వీడియో
చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ కేంద్రంలోని బిజెపికి తొత్తులుగా మారిపోయారని పాల్ ఆరోపించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్లుగా యూపీలో కంటే ఏపీలోనే బిజెపి బలంగా వుందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలంతా బిజెపికే మద్దతు ఇస్తున్నారని... యూపీలో బిజెపికి అపోజీషన్ వుంది కానీ ఏపీలో లేదన్నారు. ఏ పార్టీ గెలిచినా బిజెపికే మద్దతు ఇస్తాయని పాల్ అన్నారు.
Read More సెంట్రల్ జైల్లో చంద్రబాబు... బాలకృష్ణను పట్టుకుని బోరున విలపించిన మహిళ (వీడియో)
రాష్ట్రానికి చెందిన 90శాతం ప్రజలు వైసిపి, టిడిపి లకు వ్యతిరేకంగా వున్నాయని ప్రజాశాంతి అధినేత పేర్కొన్నారు. ఇది గ్రహించిన ఇరు పార్టీల ఎమ్మెల్యేలు, కీలక నాయకులు తనతో టచ్ లోకి వచ్చారని పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మిగతావారు కూడా టిడిపి, వైసిపి పార్టీలను వీడి ప్రజాశాంతి పార్టీలో చేరాలని పాల్ సూచించారు.
చంద్రబాబు అరెస్ట్ పై స్పందించకుండా, రాజకీయాలకు దూరంగా జూనియర్ ఎన్టీఆర్ వున్నారని... ఇది చాలా తెలివైన నిర్ణయమని అన్నారు. సినీనటులు రాజకీయాలకు దూరంగా వుండటమే మంచిదని పాల్ అన్నారు. మూవీ యాక్టర్స్ తమపని తాము చేసుకోవాలని... కాదని ఎవరికైనా మద్దతిస్తే శతృవులు పెరుగుతారని కేఏ పాల్ అన్నారు.