గోదావరి జిల్లాలో తెలుగుదేశంపార్టీకి షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నేత, జగ్గంపేట నియోజకవర్గం ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు వైసిపిలో చేరారు. గుంటూరు జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జ్యోతుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలో అరంతర్గత కలహాల కారణంగా కొంతకాలంగా చంటిబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా పార్టీ నేతలు పట్టించుకోకపోవటంతో టిడిపికి రాజీనామా కూడా చేసేసారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై గెలిచి అనంతరం జ్యోతుల నెహ్రు పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. అయితే జ్యోతుల నెహ్రు  పునరాగమనంపై అసంతృప్తిగా ఉండటమే కాకుండా  టీడీపీలో తనకు తనకు ప్రాధాన్యత లేదన్న భావంతో ఆ పార్టీకి చంటిబాబు రాజీనామా చేశారు. మరోవైపు తన మద్దతుదారుల నిర్ణయం మేరకే వైఎస్‌ఆర్‌ సీపీలో చేరినట్లు జ్యోతుల చంటిబాబు తెలిపారు.