Asianet News TeluguAsianet News Telugu

తారకరత్నను పరామర్శించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్: ఆరోగ్య పరిస్థితిపై ఆరా

బెంగుళూరులోని  నారాయణ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న   నందమూరి తారకరత్నను  జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు  ఇవాళ పరామర్శించారు.  

Junior NTR along with Kalyanram Visits Taraka Ratna in Bangalore
Author
First Published Jan 29, 2023, 11:48 AM IST

బెంగుళూరు: తీవ్ర అస్వస్థతకు  గురై బెంగుళూరులోని  నారాయణ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న  నందమూరి తారకరత్నను   సినీ నటులు   జూనియర్ ఎన్టీఆర్,  ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ లు  ఆదవారం నాడు పరామర్శించారు.ఇవాళ ఉదయం  హైద్రాబాద్ నుండి  జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్  లు  బెంగుళూరుకు చేరుకున్నారు. ఎయిర పోర్టు నుండి నేరుగా  నారాయణ ఆసుపత్రికి చేరుకున్నారు.   ఆసుపత్రిలో   తారకరత్నను  పరామర్శించారు.   తారకరత్న  భార్య అలేఖ్య రెడ్డి, కూతురులతో  జూనియర్ ఎన్టీఆర్,  కళ్యాణ్ రామ్ లు మాట్లాడారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి  వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక  ఆరోగ్య శాఖ మంత్రి  సుధాకర్ కూడా  ఆసుపత్రికి చేరకున్నారు. తారకరత్న   ఆరోగ్య పరిస్థితిపై మంత్రి వైద్యులతో మాట్లాడారు. తారకరత్నకు  మెలెనా  అనే వ్యాధి సోకినట్టుగా  వైద్యులు  అనుమానిస్తున్నారు. దీని కారణంగా   తారకరత్న  శరీరంలో బ్లీడింగ్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.  తారకరత్నకు   బెలూన్  యాంజియోప్లాస్టీ ద్వారా  బ్లడ్ పంపింగ్  చేస్తున్నారు.

also read:తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వైద్యులు..

ఈ నెల  27వ తేదీన   కుప్పంలో  లోకేష్ తో కలిసి  పాదయాత్రలో  తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో  పాల్గొన్న కొద్దిసేపటికే  తారకరత్న  కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి  చేరుకునే సమయానికి  ఆయనకు పల్స్  ఆగిపోయింది.  శరీరం నీలి రంగులోకి మారిపోయింది.  తొలుత కేసీ ఆసుపత్రిలో  ఆ తర్వాత   పీఈఎస్  మెడికల్ కాలేజీల్లో తారకరత్నకు  చికిత్స అందించారు.  మెరుగైన చికిత్స  కోసం  బెంగుళూరు  నారాయణ ఆసుపత్రికి తరలించారు.

జూ.ఎన్టీఆర్‌తో  కలిసి  ఆసుపత్రికి  హెల్త్ మినిస్టర్ సుధాకర్

జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ లు  ఇవాళ ఉదయం హైద్రాబాద్ నుండి  బెంగుళూరుకు వచ్చారు.  కర్ణాటక హెల్త్ మినిస్టర్  సుధాకర్ జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ లను  బెంగుళూరులో కలిశారు.  వీరిద్దరితో కలిసి మంత్రి నారాయణ ఆసుపత్రికి చేరుకున్నారు.తారకరత్న  ఆరోగ్య పరిస్థితి  విషమంగానే  ఉందని వైద్యులు  చెబుతున్నారు. అయితే  నిన్నటితో పోలిస్తే  ఆరోగ్యంలో  మెరుగుదల కన్పిస్తుందని బాలకృష్ణ చెప్పారు.  అవసరమైతే విదేశాల నుండి  నిపుణులను తీసుకురావాలని  కూడా  కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులను  కోరినట్టుగా సమాచారం.  నారాయణ వైద్యులతో  కూడా  మంత్రి సుధాకర్ మాట్లాడారు. 

Follow Us:
Download App:
  • android
  • ios