అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందంటూ దాఖలయిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ(గురువారం) విచారణ జరిపింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం కౌంటర్ ధాఖలు చేసింది. అయితే రిప్లయ్ కౌంటర్ ధాఖలు చేయడానికి రెండు వారాలు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం. 

విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాద్యతాయుత, రాజ్యాంగబద్ద పదవిలో ఉండి న్యాయవ్యవస్థలపై అనుచిత హ్యఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవాలి...అలా కాకుండా బహిరంగంగా కోర్టు తీర్పులపై హ్యఖ్యలు చేయడం సరికాదని న్యాయమూర్తి సూచించారు. 

ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 16 మందికి ఏపీ హైకోర్టు  శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. సీబీఐ, రిలయన్స్, జియో, వోడాఫోన్, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని హైకోర్టు ఆదేశించింది.

read more   జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్... రాజధాని నిర్ణయంతో ఆర్థిక నష్టం, ఆ శాఖకు నోటీసులు

హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ జడ్జిలతో పాటు ప్రముఖుల ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని హైకోర్టులో సోమవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ విషయమై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఓ పోలీస్ అధికారిని కూడ నియమించారని కూడ పిటిషనర్ పేర్కొన్నారు. 

ఫోన్ ట్యాపింగ్ పై కచ్చితమైన ఆధారాలు ఉంటే సమర్పించాలని హైకోర్టు పిటిషనర్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అడిషనల్ అఫిడవిట్ ను ఈ నెల 20వ తేదీన అడ్వకేట్ శ్రవణ్ కుమార్ దాఖలు చేశారు. మెయిన్ పిటిషన్ కు కలిపి పూర్తి స్థాయిలో పిటిషన్ వేయాలని ఇదివరకే హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ కు సూచించింది.