Asianet News TeluguAsianet News Telugu

క‌ర్నూలులో బంగారు నిక్షేపాలు.. తవ్వకాలు షురూ..

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి జొన్నగిరి గ్రామాల మధ్య బంగారు నిక్షేపాలు వెలికితీసే పనులు ప్రారంభమయ్యాయి. జియో మైసూర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మంగళవారం డ్రిల్లింగ్‌ పనులను మొదలుపెట్టింది. తుగ్గలి మండలంలోని పగిడిరాయి, బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలున్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే.

Jonnagiri Gold Project : Drilling Work Started Of Extraction Of Gold deposits In Kurnool
Author
Hyderabad, First Published Oct 7, 2020, 12:44 PM IST

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి జొన్నగిరి గ్రామాల మధ్య బంగారు నిక్షేపాలు వెలికితీసే పనులు ప్రారంభమయ్యాయి. జియో మైసూర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మంగళవారం డ్రిల్లింగ్‌ పనులను మొదలుపెట్టింది. తుగ్గలి మండలంలోని పగిడిరాయి, బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలున్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే.

గత 40 ఏళ్లుగా వివిధ కంపెనీలు చేసిన సర్వేల్లో ఈ బంగారం నిక్షేపాల సంగతి బైటపడింది. దీనిమీద జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గత పదిహేనుళ్లుగా సర్వే చేస్తోంది. బంగారు నిక్షేపాలను తవ్వడానికి 2013లోనే ప్రభుత్వం నుండి అనుమతులు పొందింది. 

అయితే దీనికి వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో వెలికితీత పనులు ఆలస్యమయ్యాయి. వెలికితీత కోసం జియో మైసూర్ సర్వీసెస్ రైతుల దగ్గర ఎకరానికి రూ. 12 లక్షల చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేసింది. ఈ ప్రకారం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 

కానీ, భూములు కోల్పోయే రైతులకు డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేయడం, కొన్నాళ్ల పాటు కంపెనీ ప్రతినిధులు మొహం చాటేయడంతో మైనింగ్‌ ప్రాజెక్టు కలగానే మిగిలింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతులతో మాట్లాడి ఏడాది కౌలు చెల్లించారు. పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రకారమే మంగళవారం డ్రిల్లింగ్‌ పనులు మొదలు పెట్టారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios