చంద్రబాబుకు జేడీ లక్ష్మీనారాయణ కండీషన్.. ‘పొత్తుకు ముందు ఆ పని చేయండి’
చంద్రబాబు నాయుడుకు జేడీ లక్ష్మీనారాయణ ఓ కండీషన్ పెట్టారు. బీజేపీతో పొత్తుకు ముందు ఆయన అమిత్ షా నుంచి ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన హామీల అమలుకు లిఖితపూర్వకంగా హామీ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఓ షరతు పెట్టారు. బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు చేసుకోవడానికి ముందు ఆయన ఓ పని చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి కొన్ని అంశాలపై అమిత్ షాతో లిఖితపూర్వక హామీ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: GN Saibaba: నేను జైలు నుంచి బయటికి ప్రాణాలతో రావడమే వండర్: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న హామీల అమలు చేస్తామని లిఖితపూర్వకంగా అమిత్ షా నుంచి హామీ తీసుకోవాలని ఆయన చంద్రబాబు నాయుడుకు సూచించారు. అలాగే, విశాఖ ఉక్కు పరిశమ్ర ప్రైవేటీకరణ ఉపసంహరణ, విశాఖ రైల్వే జోన్ కేటాయింపు హేతుబద్ధీకరణ వంటి వాటిపై హామీ పత్రం తీసుకోవాలని కోరారు. అంతేకాదు, తీసుకున్న ఆ హామీ పత్రాన్ని ప్రజలకు చూపించాలనీ పేర్కొన్నారు.