jd lakshmi narayana : విశాఖ నుంచే పోటీ.. అవసరమైతే కొత్త పార్టీ స్థాపిస్తా - సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ex cbi jd lakshmi narayana : ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచే పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. దాని కోసం అవసరం అయితే కొత్త పార్టీ కూడా స్థాపిస్తానని ప్రటించారు.

jd lakshmi narayana : Contest from Visakha.. Will form new party if necessary - Former CBI JD Lakshmi Narayana..ISR

jd lakshmi narayana :  ఏపీలో రాబోయే ఎన్నికల బరిలో ఉంటానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నం నుంచే పోటీ చేస్తానని అన్నారు. అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్లను ఏరివేయాలని కోరారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు.

digital payment frauds: డిజిటల్ లావాదేవీల మోసాలపై కేంద్రం ఉక్కుపాదం.. 70 లక్షల మొబైల్ నెంబర్లు సస్పెండ్..

నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని లక్ష్మీ నారాయణ కోరారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 2వ తేదీన విశాఖపట్నంలో జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

మరి దేవాలయాల్లో హారతి సంగతేంటి ? : మసీదులో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలన్న పిటిషన్ పై హైకోర్టు వ్యాఖ్యలు..

ఈ జాబ్ మేళాలో 50కు పైగా కంపెనీలు పాల్గొంటాయని లక్ష్మీ నారాయణ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అక్కడే ఆఫర్ లెటర్లు కూడా అందజేస్తామని ఆయన చెప్పారు. ఈ జాబ్ మేళాలో కొంచెం వెనకంజలో ఉన్న అభ్యర్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామమని స్పష్టం చేశారు. పదో తరగతి, దాని కంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న అభ్యర్థలందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios