వచ్చే ఎన్నికల్లో కోడుకు విజయం కోసం అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి త్యాగం చేసారా? పరిస్ధితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వచ్చే బుధవారం తన ఎంపి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు దివాకర్ రెడ్డి ఈరోజు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. పార్టీలోను బయట ఇపుడదే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. జెసి ప్రకటన చేయటానికి దారితీసిన పరిస్ధితులను కాస్త నిశితంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్ధమవుతాయి.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని ఎప్పుడో ప్రకటించారు జెసి. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుండే దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి రెడీ అయిపోతున్నారు. కాకపోతే ఏ పార్టీ నుండన్నది సస్పెన్స్. టిడిపి నుండైతే టిక్కెట్టు సునాయాసంగానే తెచ్చుకుంటారనటంలో సందేహంలేదు. అయితే, పవన్ అటు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తో కూడా టచ్ లోనే ఉండటంతో సర్వత్రా అయోమయం మొదలైంది.
అనంతపురంలో రోడ్ల విస్తరణ చేయలేక, చాగల్లు ద్వారా మంచినీటిని తాడిపత్రికి తేవటంలో విఫలమైనందు వల్లే తాను రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు జెసి చెప్పటంలో అర్ధం లేదు. ఎందుకంటే, పై రెండు కారణాలు ఇప్పటికిప్పుడు మొదలైన సమస్యలు కావు. గడచిన మూడున్నరేళ్ళుగా ఉన్నవే. ఇక్కడే ఓ విషయం అర్ధమైపోతోంది. అదేంటంటే జెసి సోదరులపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత మొదలైపోయింది. ఇదే వ్యతిరేకత వచ్చే ఎన్నికల నాటికి మరింత పెరగిపోయి గెలుపుపైనే ప్రభావం చూపటం ఖాయం.
ఈ విషయాలన్నింటినీ లెక్కేసుకునే జెసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే, ఏ పని చేయలేక 2019 ఎన్నికలను ఎదుర్కొనే కన్నా ముందుగానే రాజీనామా చేసేస్తే వచ్చే ఎన్నికల నాటికి సింపతీ అయినా ఉంటుంది. ఒకవేళ సింపతీ లేకపోయినా కనీసం తన కొడుకు మీద వ్యతరేకత అయినా తగ్గుతుందని జెసి ఆలోచించి వుండవచ్చు. ఇక, రెండో కారణం, జిల్లాలో ఎటుచూసినా కమ్మ సామాజికవర్గానిదే ప్రాబల్యం. పైగా అందరూ తనకు వ్యతిరేకులే. అందువల్లే జిల్లా స్ధాయిలో జెసికి ఒక్క పని కూడా కావటం లేదు. తనపైన వ్యతిరేకతుందని, కమ్మ వాళ్ళ ప్రాబల్యాన్ని తట్టుకోలేకపోతున్నట్లు బహిరంగంగా చెప్పుకోలేరు కదా? అందుకే తన రాజీనామాకు అబివృద్ధి ముసుగు వేసారు.