పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు. తాడిపత్రిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందన్న ఆయన.. 70 నుంచి 80 శాతం పోలింగ్ నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు బ్రహ్మండంగా పనిచేశారని.. గెలుపోటములు సహజమని జేసీ వ్యాఖ్యానించారు. పోలిసులు శాంతిభద్రతలను కాపాడారని... వారికి సెల్యూట్ చేస్తున్నా అన్నారు.

కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కడప జైలు నుంచి విడుద‌లైన తర్వాత ప్రభాకర్ రెడ్డి ర్యాలీగా తాడిపత్రి వచ్చారు.

ఆ సమయంలో ట్రాఫిక్ సీఐ పట్ల జేసీ దురుసుగా ప్రవర్తించారని ఈ కేసులు నమోదు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి 24 గంట‌లు తిర‌గ‌క ముందే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మ‌రో మూడు కేసులు నమోదు కావడం అప్పట్లో సంచలనం కలిగించింది.