2014 ఎన్నికలకు ముందు తనకు టికెట్ ఇవ్వడానికి జగన్ 30 కోట్లు అడిగారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని, తన ప్రధాన అనుచురుల్లో ఒకరైన కాంట్రాక్టర్‌ను జగన్మోహన్ రెడ్డి తన వద్దకు పంపించారని దివాకర్ రెడ్డి తెలిపారు.

టికెట్ ఇవ్వాలంటూ రూ. 30 కోట్లు ఇవ్వాల్సిందిగా వారు తనను డిమాండ్ చేశారని కానీ తాను అందుకు అంగీకరించలేదన్నారు. ‘‘వాళ్ల తాత నాకు తెలుసు.. వాళ్ల నాయినా నాకు తెలుసు.. నేను పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్‌తో పుట్టాను.. వాళ్ల తాతకన్నా మా తాతలు చానా భూస్వాములు, పెద్ద రెడ్లు, నా కంటేప అతను పెద్దొడా..? నేను కప్పం కట్టడానికి..? అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచనలం కలిగిస్తున్నాయి.