ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  సెటైర్ వేశారు. కాగా.. ఇప్పుడు ఆ సెటైర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇంతకీ మ్యాటరేంటంటే...రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు అనంతపురం జిల్లాకు వెళ్లారు. అక్కడి ముఖ్య నేతలతో సమావేశమై.. నేతలకు చీవాట్లు పెట్టారు.

అనంతపురం జిల్లాలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని.. పార్టీ ప్రయోజనాలు పట్టించుకోకుండా నాయకులు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు.. నేతలపై మండిపడ్డారు. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను తీసుకురావాలని చూస్తున్న నేతలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులకు పెత్తనం కట్టబెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ.. పరోక్షంగా మంత్రి పరిటాల సునీతకు చురకలు అంటించారు. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తానని, పార్టీకు అనుగుణంగా నాయకులు నడుచుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అందరూ కలసికట్టుగా పనిచేయాలని లేకుంటే సీనియర్లనైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.

అయితే.. చంద్రబాబు నేతలకు పీకిన క్లాస్ పై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. నీతులు, సూక్తులు తమకు మాత్రమే చెబుతున్నారని.. వాటిని చంద్రబాబు ఫాలో అవుతారా అంటూ వ్యంగాస్త్రం వేశారు. తమ కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని జేసీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ ప్రయత్నానికి చంద్రబాబు అడ్డుతగిలారు. ఈ నేపథ్యంలో ఆ కోపంతోనే జేసీ ఇలాంటి సెటైర్ వేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ సెటైర్ మీద ఇప్పటి వరకు చంద్రబాబు స్పందించలేదు. 

read more news

మీ కొడుక్కి సీటా, అయితే ఓ కండీషన్: జేసీకి చంద్రబాబు ఝలక్

చంద్రబాబుపై పొగడ్తలు, జగన్ కి చురకలు అంటించి జేసీ

మళ్లీ నోరు జారిన జేసీ, రోషం లేనివాళ్లంతా ఎమ్మెల్యేలయ్యారంటూ చురకలు