రాజీనామా మాట నిజమే.. రోడ్ల కోసం కాదు.. దేశంలో రాజకీయాలు బాలేవు

JC Diwakar Reddy About His Resignation
Highlights

ఎంపీ పదవికి తాను రాజీనామా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని అంగీకరించారు జేసీ.. ఆ వ్యాఖ్యలు తాను చేసినవేనని దేశంలో ప్రస్తుత రాజకీయ వాతావరణం బాగోలేదని  అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన వేళ.. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని.. తాను అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చకు హాజరవ్వని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఆయన్ను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నించినప్పటికీ జేసీ మాత్రం బెట్టు వీడలేదు. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయబోతున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిని ఎవరూ ఖండించలేదు.

అయితే ఎంపీ పదవికి తాను రాజీనామా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని అంగీకరించారు జేసీ.. ఆ వ్యాఖ్యలు తాను చేసినవేనని దేశంలో ప్రస్తుత రాజకీయ వాతావరణం బాగోలేదని  అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నారు. అనంతపురంలో రోడ్ల కాంట్రాక్టు పనుల కోసం తాను రాజీనామా చేయబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఆయన... రాజీనామా ఎప్పుడు చేయాలన్న విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

తాను ఇక రాజకీయాల నుంచి గౌరవంగా తప్పుకోవాలని అనుకుంటున్నానని.. తనకు రాజకీయ వారసుడిగా తన కుమారుడు కొనసాగుతాడని చెప్పారు. అయితే ఎప్పుడు రాజీనామా చేస్తారనన్న ప్రశ్నకు బదులుగా తాను ఏం చేసినా చెప్పే చేస్తానన్నారు.


 

loader