జయదేవ్ సినిమాపోస్టర్ ను గుర్తుతెలీని వారెవరో చింపేసారు. నర్సీపట్నంలోని రాజు థియోటర్లో అంటించిన పోస్టర్లతొ పాటు కటౌట్లను కూడా పాడుచేసారు.

గంటా శ్రీనివాసరావు కొడుకు గంటారవి నటించిన జయదేవ్ పోస్టర్ చిరిగిపోయింది. చిరిగింది కూడా ఎక్కడో కాదు బద్ద శత్రువైన చింతకాయల అయ్యన్నపాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నంలో. ఇద్దరు మంత్రులకు మధ్య ఉప్పు-నిప్పు లాగుంది ఈ మధ్య. ఈ నేపధ్యంలోనే జయదేవ్ సినిమాపోస్టర్ ను గుర్తుతెలీని వారెవరో చింపేసారు. నర్సీపట్నంలోని రాజు థియోటర్లో అంటించిన పోస్టర్లతొ పాటు కటౌట్లను కూడా పాడుచేసారు. దాంతో నర్సీపట్నంలో గొడవ మొదలైంది. ముందు జాగ్రత్తగా పోలీసులు సినిమా థియేటర్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.