కక్ష సాధింపు కోసమే చంద్రబాబు అరెస్ట్.. సీఎం అయిన నాటి నుంచి జగన్ ఇంతే : నాదెండ్ల మనోహర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడంపై స్పందించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ . ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి జగన్ తీరు ఇలానే వుందని దుయ్యబట్టారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడంపై స్పందించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా కక్ష సాధించడం కోసమే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. విపక్షాల గొంతు నొక్కడమే వైసీపీ లక్ష్యమని.. ఏపీలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి జగన్ తీరు ఇలానే వుందని దుయ్యబట్టారు.
Also Read: చంద్రబాబు కోసం బెజవాడకి .. పవన్ ప్రత్యేక విమానానికి పోలీసుల అనుమతి నిరాకరణ
నెగెటివ్ ఆలోచనలతో రాష్ట్రాన్ని నెగెటివ్ గ్రోత్‌లోకి నెట్టేశారని.. మూడేళ్ల కిందట నమోదైన ఎఫ్ఐఆర్‌ను తీసుకొచ్చి చంద్రబాబును అరెస్ట్ చేయడం ఏంటని నాదెండ్ల ప్రశ్నించారు. విపక్షాల గొంతు నొక్కేందుకు జగన్ ప్రభుత్వం వ్యవస్థలను ఉపయోగించుకుంటోందని మనోహర్ ఆరోపించారు. రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు తీసుకురావాలన్న దానిపై ఆలోచించాల్సిన ప్రభుత్వం.. కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నాదెండ్ల మండిపడ్డారు. గతంలో పవన్ కల్యాణ్‌ను విశాఖలో ప్రజలను కలవనివ్వకుండా.. జనసేన నేతలపైనే హత్యాయత్నం కేసులు మోపారని మనోహర్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబుపై కక్ష సాధించేందుకు మూడు నాలుగు నెలల నుంచి ప్రయత్నిస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు.