మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో నిర్వహించిన విశాఖ గర్జన సభపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు. విశాఖ అల్రెడీ రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ అని .. మీరు చేసేది ఏంటని ఆయన వైసీపీ నేతలపై మండిపడ్డారు.

మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో నిర్వహించిన విశాఖ గర్జన సభపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు. ‘‘ Vizag ని మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబు . Vizag already రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ. వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చెయ్యమని గర్జించండి .’’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇకపోతే... తన పర్యటనలో భాగంగా నేడు విశాఖపట్నం అర్బన్, రూరల్ పరిధిలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పవన్‌ కల్యాణ్ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Also REad:విశాఖపట్నం చేరుకున్న పవన్ కల్యాణ్.. ఘన స్వాగతం పలికిన జనసేన కార్యకర్తలు.. భారీ ర్యాలీ..

రేపు (అక్టోబర్ 16) ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలపై వచ్చే ఆర్జీలను పవన్ కల్యాణ్ స్వీకరించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అక్కయపాలం హైవే రోడులోని పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా జనసేన వర్గాలు తెలిపాయి. 

ఇక, రేపు సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 17వ తేదీ ఉదయం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం బీచ్ రోడ్డులోని వైఎంసీఏ హాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం కానున్నారు. 

Scroll to load tweet…