ప్రత్యేక హోదాపై బాబు మాట మార్చారు: పవన్

janasena chief Pawan Kalyan slams on Chandrababunaidu
Highlights

బాబుపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

యలమంచిలి: ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బాగుందని  బిజెపి నేతలను అభినందించిన చంద్రబాబునాయుడు ఇప్పడుు ప్రత్యేక హోదా కావాలని ఎందుకు కోరుతున్నాడని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.ప్రత్యేక హోదాపై బాబు మాటలు మార్చారని ఆయన ఆరోపించారు. 

యలమంచిలిలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సభలో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.


విశాఖ రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేశాం, దీని వల్ల ఉద్యోగాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాండవ నది నుండి ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారని ఆయన ఆరోపించారు. వెయ్యి ఎకరాలను మత్స్యకారుల నుండి తీసుకొని పునరావాసం కల్పించలేదని ఆయన ఆరోపించారు.  కేంద్రం నుండి నిధులు రాలేదని చేతులు దులుపుకొంటున్నారని ఆయన విమర్శించారు.


ప్రత్యేక హోదా విషయమై బిజెపి ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.చట్టసభల్లో మాట్లాడిన మాటలకు కూడ విలువ లేదా అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక హోదా వద్దు , ప్రత్యేక ప్యాకేజీ కావాలని బాబు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత లేదని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన బిజెపి నేతలను ఆనాడు  చంద్రబాబునాయుడు పొగిడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆనాటి నుండి నేటి వరకు తాను ఒకే మాటను మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు.  ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  తనకు ఓట్లు రావనే భయం లేదు. ఎమ్మెల్యేలు ఓడిపోతారనే భయం లేదన్నారు. కానీ, తాను ఇంతవరకు  ఒకే మాట మీద ఉన్నానని ఆయన చెప్పారు. తాను చెప్పిన మాటల వల్ల మార్పులు వస్తాయని ఆయన చెప్పారు. 


ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ పేరుతో వేలాది ఎకరాల భూమిని స్వాహ చేస్తున్నారని ఆయన చెప్పారు. అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలకు  ప్రత్యేక ఆర్ధిక మండళ్ళను ఏర్పాటు చేయాల్సిన అవ

loader