అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఎప్పుడైతే జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాడో... ఇక అది మొదలు రాష్ట్రంలో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాయ్ తాము మరింతగా నష్టపోతామని రాయలసీమ ప్రజలు రోడ్డెక్కితే... అమరావతి నుండి రాజధాని ప్రాంతాన్ని తరలించొద్దంటూ ఆప్రాంత రైతులు వీధుల్లోకి వచ్చారు. 

ఇక ఇదంతా జరుగుతూ ఉండగానే నిన్న రాజధాని విషయమై జిఎన్ రావు కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అందించారు. ఆ తరువాత వారు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. 

Also read: రాజధానిపై బోస్టన్ కమిటీ మధ్యంతర నివేదిక ఇదీ...

ఇక ఇందాక కొద్దిసేపటి కింద రాజధాని విషయమై అధ్యయనం చేస్తున్న బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఒక మధ్యంతర నివేదికను ఇచ్చారు. అందులోవారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని కన్నా, బ్రౌన్ ఫీల్డ్ రాజధానే లాభదాయకం అని తేల్చారు. 

ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏమిటి? వారు ఆ నివేదికలోగుట్టు ఏమిటో తెలుసుకుందాం. 

గ్రీన్ ఫీల్డ్ రాజధాని అంటే...ఏ ఒక్క భవంతి కూడా లేని చోట ఖాళీ సౌకర్యాలు వసతులు లేని చోట మొత్తం నిర్మాణాలన్నీ నూతనంగా మొదలుపెట్టడాన్ని మనం గ్రీన్ ఫీల్డ్ అంటాము. ఉదాహరణకు మన ప్రస్తుత రాజధాని అమరావతి. 

Also read: రాజధానిపై జీఎన్ రావు కమిటీ: అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్రిక్తత

అమరావతి ఏర్పడటానికి పూర్వం ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కానీ నిర్మాణాలు కానీ లేవు. పూర్తిగా నిర్మాణం చేయవలిసి వచ్చింది. ఇలా చేసే నిర్మాణాలని మనం గ్రీన్ ఫీల్డ్ నిర్మాణాలు అని అంటాము. 

ఇక ఇప్పటికే అక్కడ నిర్మాణం జరిగి ఉన్న ఏదైనా దాన్ని గనుక మనం అభివృద్ధి చేస్తే మనం దాన్ని బ్రౌన్ ఫీల్డ్ రాజధాని అని అంటాము. ఉదాహరణకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఉంది. దాన్ని గనుక ఆధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా గనుక మారిస్తే దానిని బ్రౌన్ ఫీల్డ్ అంటాము. 

ఇప్పుడు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇలా బ్రౌన్ ఫీల్డ్ రాజధానే మేలు అని చెప్పడం ద్వారా విశాఖపట్నాన్ని రాజధానిగా ఓకే చేస్తుందని అర్థం. గ్రీన్ ఫీల్డ్ వద్దు అనడం ద్వారా అమరావతిలో నిర్మాణాల వల్ల కలిగే ప్రయోజనాలకన్నా ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్న విశాఖను గనుక ఎంచుకుంటే రాష్ట్రానికి సత్వర లాభం చేకూరుతుందనేది ఈ గ్రూప్ అభిప్రాయం.