శాసనమండలి రద్దు సరికాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీ అసెంబ్లీలో కౌన్సిల్ రద్దు తీర్మానం ఆమోదం జరిగిన తర్వాత పవన్ స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పునరుద్దరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం తప్పని పవన్ అభిప్రాయపడ్డారు.

ఏదైనా బిల్లుపై శాసనసభలో తప్పు నిర్ణయం తీసుకుంటే సరిదిద్దడానికే పెద్దల సభను రూపొందంచారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. శాసనమండలి రద్దు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్ధలను తొలగించుకుంటూ పోవడం సరికాదన్నారు.

Also Read:శాసనమండలి రద్దు: ఏపీ అసెంబ్లీ ఆమోదం, టీడీపీ గైర్హాజర్

శాసనమండలి రద్దుకు ప్రజామోదం ఉందా..? లేదా..? అనే అంశాన్ని పరిగణనలోనికి తీసుకోలేదని పవన్ విమర్శించారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోతే దానిని రద్దు చేయడం సహేతుకంగా లేదన్నారు. మండలి రద్దుతో మేధావుల ఆలోచనలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లేనని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏపీ  శాసనమండలి రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ సోమవారం నాడు తీర్మానం చేసింది.సోమవారం నాడు ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు.

సోమవారం నాడు సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ తీర్మానంపై  ప్రసంగించారు.  శాసనమండలిని ఎందుకు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందో వివరించారు. ఆ తర్వాత  ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ జరిగింది. 

సీఎం ప్రసంగం తర్వాత  ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులంతా లేచి నిలబడాలని స్పీకర్ కోరారు. సభ్యులను లెక్కించిన తర్వాత సభ్యులు కూర్చొన్నారు.

Also Read:ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్: ఆ ముగ్గురు ఏం చేశారో తెలుసా?

ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు ఎవరైనా నిలడాలని స్పీకర్ కోరారు. ఆ సమయంలో సభ్యులు ఎవరూ కూడ లేచి నిలబడలేదు.  ఈ సభలో సభ్యులు కానందున డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్,  మంత్రి మోపిదేవి వెంకటరమణలను వేరే చోట కూర్చోవాలని స్పీకర్ కోరారు.

ఆ తర్వాత అసెంబ్లీ సిబ్బంది  ఎమ్మెల్యేలను లెక్కించారు. ఏపీ శాసనమండలి రద్దు కోరుతూ తీర్మానానికి అనుకూలంగా 133 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు