అమరావతి: ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు  సమయంలో పార్టీకి దూరంగా ఉంటున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం  ఓటింగ్ సమయంలో సభలో లేరు. 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్  జరిగే సమయంలో సభలో లేరు.

Also read:శాసనమండలి రద్దు: ఏపీ అసెంబ్లీ ఆమోదం, టీడీపీ గైర్హాజర్

ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు కోరుతూ తీర్మానాన్ని సీఎం జగన్ సోమవారం నాడు ఉదయం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సమర్ధిస్తూ మాట్లాడిన జగన్ తీర్మానాన్ని బలపర్చాలని కోరారు.

Also Read:రాజకీయ కోణంలో పనిచేసే శాసనమండలి అవసరమా: జగన్

ఈ సందర్భంగా ఈ తీర్మానంపై  సభలో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ జరిగే సమయంలో టీడీపీ నుండి సస్పెన్షన్ కు గురైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ లాబీల్లో ఉన్నాడు.  

అసెంబ్లీకి మరో టీడీపీ ఎమ్మెల్యే  మద్దాలి గిరి ఓటింగ్ సమయంలో అసెంబ్లీలో లేడు. ఇటీవలనే మద్దాలి గిరి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. వైసీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ సమయంలో దూరంగా ఉన్నారు. 

Also read:రద్దుకే జగన్ నిర్ణయం: మండలి రద్దు, పునరుద్ధరణ చరిత్ర ఇదీ...

ఇక జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనమండలి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు లేఖ రాశారు. అయితే ఈ విషయమై  ప్రభుత్వానికి మద్దతుగానే రాపాక వరప్రసాద్ వ్యవహరించారు. సోమవారం నాడు ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అనకూలంగా  రాపాక వర ప్రసాద్ ఓటు చేశారు. 

అసెంబ్లీలో ఓ బిల్లుపై ఓటింగ్ జరిగే సమయానికి 18 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేరు.  కీలకమైన తీర్మానంపై ఓటింగ్ జరిగే సమయంలో ఎమ్మెల్యేలు లేకపోవడంపై సీఎం జగన్  ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా  సమాచారం.