అమరావతి: ఏపీ  శాసనమండలి రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ సోమవారం నాడు తీర్మానం చేసింది.సోమవారం నాడు ఉదయం ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు.

Also Read:రాజకీయ కోణంలో పనిచేసే శాసనమండలి అవసరమా: జగన్

సోమవారం నాడు సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ తీర్మానంపై  ప్రసంగించారు.  శాసనమండలిని ఎందుకు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందో వివరించారు. ఆ తర్వాత  ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ జరిగింది. 

Also read:రద్దుకే జగన్ నిర్ణయం: మండలి రద్దు, పునరుద్ధరణ చరిత్ర ఇదీ...


ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై  సీఎం ప్రసంగం తర్వాత  ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యులంతా లేచి నిలబడాలని స్పీకర్ కోరారు. సభ్యులను లెక్కించిన తర్వాత సభ్యులు కూర్చొన్నారు.

ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు ఎవరైనా నిలడాలని స్పీకర్ కోరారు. ఆ సమయంలో సభ్యులు ఎవరూ కూడ లేచి నిలబడలేదు.  ఈ సభలో సభ్యులు కానందున డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్,  మంత్రి మోపిదేవి వెంకటరమణలను వేరే చోట కూర్చోవాలని స్పీకర్ కోరారు.

ఆ తర్వాత అసెంబ్లీ సిబ్బంది  ఎమ్మెల్యేలను లెక్కించారు. ఏపీ శాసనమండలి రద్దు కోరుతూ తీర్మానానికి అనుకూలంగా 133 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు.ఏపీ శాసన మండలి రద్దు కోరుతూ సోమవారం నాడు ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి టీడీపీ గైర్హాజరైంది. టీడీపీ సభ్యులు సోమవారం నాడు అసెంబ్లీకి హాజరుకాలేదు. 

టీడీపీ సభ్యులు సోమవారం నాడు అసెంబ్లీకి హాజరుకాలేదు. ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా 133 మంది అనుకూలంగా ఓటు చేశారు. వైసీపీకి 151 మంది సభ్యులు ఉన్నారు. 

అయితే అసెంబ్లీకి వైసీపీ సభ్యులంతా ఇవాళ సభకు హాజరయ్యారా, హాజరైతే  లాబీల్లో ఉండిపోయారా అనేది తేలాల్సి ఉంది. అసెంబ్లీ లాబీల్లో ఉండి కూడ అసెంబ్లీలో ఓటింగ్ జరిగే సమయంలో ఎమ్మెల్యేలు రాకపోతే ఆ విషయమై  వైసీపీ నాయకత్వం ఏ రకంగా వ్యవహరిస్తోందో అనేది చూడాలి.

అసెంబ్లీలో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఎవరూ ఓటు చేయలేదు. అంతేకాదు ఈ బిల్లు విషయంలో కూడ తటస్థంగా వ్యవహరించిన సభ్యులు కూడ ఎవరూ లేరు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపనుంది.