మహిళా సాధికారత, స్వావలంబన సాధించాలంటే వారికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కుటుంబాలను సమర్ధవంతంగా నడిపే ఆడపడుచులు సమాజాన్ని నడపలేరా? అని ప్రశ్నించారు. కనీసం చట్టుసభల్లో మూడో వంతు మహిళలు ఉండాలని ఆకాక్షిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. 

శనివారం పశ్చిమగోదావరి జిల్లా అన్నవరంలోని గౌరీ కళ్యాణ మండపంలో పవన్ డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనతో తమ గోడును తెలిపారు. ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మాపీ చేయలేదని వారు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తెలుగు దేశం పార్టీ నాయకులు చెప్పిన గ్రూపులకే రుణాలు ఇస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీలో పనిచేస్తున్న మహిళలను గ్రూపుల నుండి తొలగిస్తున్నరని పవన్ కు తెలిపారు. 

మహిళలు స్వశక్తితో ఎదగడానికి ఈ పథకం తోడ్పడాలి కానీ అధికార పార్టీలకు ఉపయోగపడేలా పథకాన్ని మార్చేశారని పవన్ అధికార పార్టీపై ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా పథకం నిర్వహణకు ఓ ఐఏఎస్‌ను నియమిస్తామన్నారు. త్వరలో డ్వాక్రా మహిళలకు రాజకీయ అవగాహన శిబిరాలు కూడా నిర్వహిస్తామని పవన్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు

సామాన్యుడితో పవన్ రైలు యాత్ర

చంద్రబాబు సినిమా ప్లాప్ అవ్వడం ఖాయం:పవన్ కళ్యాణ్

జగన్ పై దాడి ఘటనలో టీడీపీ వెకిలి వేషాలు:పవన్ కళ్యాణ్

కుత్తికోసుకుంటా కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టను:పవన్ కళ్యాణ్