Asianet News TeluguAsianet News Telugu

మూడు రాజధానుల పేరుతో జగన్నాటకం.. అమరావతే ఏపీకి రాజధాని , జనసేన స్టాండ్ ఇదే : తేల్చేసిన పవన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో జనసేన స్టాండ్ ఏంటో స్పష్టం చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. అమరావతే రాష్ట్ర రాజధానిగా వుండాలన్నది తమ అభిమతమని, ఏపీ నుంచే జనసేన రాజకీయం నడుస్తుందని పవన్ పేర్కొన్నారు. 


 

janasena chief pawan kalyan key comments on ap capital amaravathi ksp
Author
First Published Jun 14, 2023, 7:57 PM IST | Last Updated Jun 14, 2023, 7:57 PM IST

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వుంటుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వైసీపీని ఎన్నుకుంటే కొండలతో సహా మింగేస్తారని అప్పుడే చెప్పానని ఆయన గుర్తుచేశారు. గాజువాకలో తనను గెలిపించి వుంటే రిషికొండలో వైసీపీ దోపిడిని ఆపేవాడినని పవన్ తెలిపారు. మద్యపాన నిషేధం సాధ్యం కాదని తాను ఆనాడే చెప్పానని పేర్కొన్నారు. ప్రాంతాలవారీగా చేయొచ్చు తప్పించి.. రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయడం సాధ్యం కాదని పవన్ తెలిపారు.

జగన్ పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. మూడు రాజధానులు అంటూ జగన్ నాటకాలు ఆడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నుంచి రిజిస్ట్రార్ వరకు ఒకటే కులానికి పట్టం కడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతికి చెందిన దాదాపు 200 మందికి పైగా రైతులు గుండెపోటుతో చనిపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల బిడ్డతో సహా అందరిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ALso Read: ఈసారి అసెంబ్లీలో అడుగుపెడతా.. దమ్ముంటే ఆపు : జగన్‌కు పవన్ కళ్యాణ్ ఛాలెంజ్

రాజధాని అనేది గ్రోత్ ఇంజిన్ అన్నారు. అమరావతిలో అన్ని కులాలు వున్నాయని పవన్ తెలిపారు. పాలసీ పరంగానే తాను వైసీపీపై విమర్శలు చేస్తున్నానని చెప్పారు. మీ దగ్గర రౌడీలు వున్నారేమో కానీ.. నా దగ్గర విప్లవకారులు వున్నారని పవన్ పేర్కొన్నారు. జనసేన ప్రభుత్వం రాగానే కొత్తగా పెళ్లయిన వారికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తో పాటు రేషన్ కార్డ్ ఇస్తానని తెలిపారు. సంక్షేమ పథకాలకు జనసేన వ్యతిరేకం కాదని.. వైసీపీ నేతలు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios