ఓటర్ల తనిఖీ విధుల్లో వాలంటీర్లు.. ఫోటోలు షేర్ చేస్తూ, మరోసారి రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్
ఎన్నికల విధులు, ఓటర్ల తనిఖీల్లో వాలంటీర్లు పాల్గొనడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తగ్గేదే లేదంటున్నారు. ప్రభుత్వం సీరియస్ అయినా, స్వయంగా సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చినా పవన్ తన దూకుడు తగ్గించడం లేదు. తాజాగా మరోసారి వాలంటీర్లపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల తనిఖీ విధుల్లో వాలంటీర్లు పాల్గొనడంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
ఓటర్ల తనిఖీలో వాలంటీర్లు పాల్గొనడం చట్ట విరుద్ధమని .. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. బూత్ లెవల్ అధికారులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వున్న వైసీపీ నేతలు, వాలంటీర్లు ఇంటింటి సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు
అంతకుముందు బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపైనా పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. . యాప్స్ అనేది చాయిస్ అని, టీచర్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా బైజూస్ కంపెనీ నష్టాల్లో ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టులు ఇస్తున్నారని వైసీపీ సర్కార్‌పై పవన్ విమర్శలు గుప్పించారు. ఈ కాంట్రాక్టుకు సంబంధించి టెండరింగ్ ప్రక్రియపై కూడా ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. తన ప్రశ్నలపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యా రంగంలో నెలకొన్న సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు.
‘మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు, టీచర్ రిక్రూట్‌మెంట్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదు. కానీ నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టు వస్తుంది. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిందా? టెండర్ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి, ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు? ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉందా? వైసీపీ ప్రభుత్వం స్పందించాలి’’ అని పవన్ పేర్కొన్నారు.
ALso Read: జగన్ సర్కార్‌పై మరోసారి ఫైర్.. యాప్స్ చాయిస్, టీచర్ మస్ట్.. బైజూస్‌కు కాంట్రాక్ట్‌పై పవన్ ప్రశ్నలు..
ట్యాబ్‌లు మంచివేనని.. అయితే ముందుగా పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని వైసీపీ సర్కార్‌ను ఎద్దేవా చేశారు. యాప్స్ అనేది చాయిస్ అని, టీచర్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలని పవన్ అన్నారు. ఇక, బైజూస్ కంపెనీ నష్టాల్లో ఉన్నట్టుగా చెబుతున్న పలు మీడియా కథనాలను కూడా పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో పొందుపరిచారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను, ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఈ ట్వీట్‌లో ట్యాగ్ చేశారు.