భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కో ఆపరేటివ్ బ్యాంకులను దోచుకున్న వ్యక్తి భీమవరం ఎమ్మెల్యే అంటూ జనసేనాని సంచలన ఆరోపణలు చేశారు.

151 మంది ఎమ్మెల్యేలు సేవ చేయడం మాని ప్రజలను హింసిస్తున్నారని పవన్ ఆరోపించారు. రోడ్డుపై వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని, కానీ తాము అలా చేయలేమని ఆయన చెప్పారు. తనను వ్యక్తిగతంగా దూషించడం రివాజుగా మారిందని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, పవన్ కళ్యాణ్ సహా జనసేన నాయకులపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీరవాసరం మండలం మత్స్యపురిలో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని మండిపడ్డారు.

అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసి ధ్వంసం చేశారన్నారు. జనసేన కార్యకర్తలు సంఘ విద్రోహ శక్తులుగా అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు.