Asianet News TeluguAsianet News Telugu

పవన్‌కు కల్యాణ్‌కు కరోనా: అధినేత కోలుకోవాలంటూ జనసైనికుల చండీ హోమం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా నుంచి  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అధ్వర్యంలో విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శనివారం చండీహోమం నిర్వహించారు.

janasena activiststs perform chandi homam for pawan kalyan ksp
Author
Vijayawada, First Published Apr 17, 2021, 7:58 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా నుంచి  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అధ్వర్యంలో విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శనివారం చండీహోమం నిర్వహించారు. ఉదయం 7.30 నుండి 10.00 వరకు వెన్న శివశంకర్ సునీత మరియు కోరికని మల్లేశ్వరరావు అనురాధ దంపతులతో కలిసి ఆయన చండీ హోమంలో పాల్గొన్నారు. 

కాగా ఈ నెల 3న తిరుపతిలో పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్ చేయించుకోగా, నెగిటివ్ వచ్చింది. అయితే ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఒక్కొక్కరు కరోనా బారినపడుతుండటంతో పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

Also Read:జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్

అయితే శుక్రవారం కొద్దిపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో కరోసారి కరోనా టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చిందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. తన ఫామ్ హౌస్ లో ఉంటూనే ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు. మరోవైపు పవన్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

ఈ క్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా పవన్ కోలుకోవాలని ఆకాంక్షించారు. పవన్ ఆయురారోగ్యాలతో ఉండాలని.. వైద్యులు ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు కోరారు. పవన్ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు రావాలని టీడీపీ అధినేత ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios