వైసీపీ నేతలపై జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆయన కోరారు. ఏపీలో జనసేన బలోపేతం అవుతోందనే ఉద్దేశ్యంతోనే  పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మనోహర్ చెప్పారు.

అమరావతి:సినిమా ఇండస్ట్రీని కాపాడమంటే పవన్ ను కాపాడమని అర్ధం కాదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇది అర్ధం కాని మూర్ఖులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బుధవారం నాడు మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృతస్తాయి సమావేశంలో నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు.మూడు నాలుగు రోజులుగా చోటు చేసుకొన్న పరిణామాలు తనను ఆవేదనకు గురి చేశాయని ఆయన చెప్పారు.సినిమాలు ఒక కెరియర్‌గా పవన్ కళ్యాణ్ ఏనాడూ భావించలేదని నాదెండ్ల మనోహర్ చెప్పారు. సినీ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారని మనోహర్ గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గౌరవిస్తారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. పవన్ కళ్యాణ్ కష్టపడి పార్టీని నడుపుతున్నారని ఆయన గుర్తు చేశారు. పవన్ పై వ్యక్తిగత దాడి చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జనసైనికులకు పార్టీ అండగా నిలుస్తోందని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.జనసేన ఏపీ రాష్ట్రంలో బలోపేతమౌతున్న విషయాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నాయకత్వం ఇష్టంమొచ్చినట్టుగా విమర్శలు చేస్తున్నారన్నారు.