సారాంశం

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై రేపటి సమావేశంలో చర్చించే అవకాశం ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పొత్తులపై  రేపటి సమావేశంలో చర్చించే అవకాశం ఉందని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  చెప్పారు.ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్   సోమవారంనాడు సాయంత్రం  న్యూఢిల్లీకి చేరుకున్నారు

. రేపు  న్యూఢిల్లీలో  ఎన్డీఏ  పక్షాల సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో  పాల్గొనాలని   జనసేనకు  ఆహ్వానం అందింది.  దీంతో జనసేన పీఏసీ చైర్మెన్  నాదెండ్ల మనోహర్ తో కలిసి  పవన్ కళ్యాణ్  ఇవాళ  న్యూఢిల్లీకి చేరుకున్నారు. 

ఈ అవకాశం చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని  పవన్ కళ్యాణ్ చెప్పారు.  ఎన్టీఏ సమావేశానికి హాజరు కావాలని  బీజేపీ నేతలు ఆహ్వానించారని ఆయన గుర్తు  చేశారు.తెలుగు రాష్ట్రాల అభివృద్ది మార్గాలపై  రేపటి భేటీలో చర్చిస్తామన్నారు. ఏన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై  కూడ చర్చించనున్నట్టుగా  పవన్ కళ్యాణ్ తెలిపారు.

2019  ఎన్నికల తర్వాత  బీజేపీతో పవన్ కళ్యాణ్ జనసేన మిత్రపక్షంగా మారింది.  2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ అప్పట్లోనే ప్రకటించారు.  అయితే  ఏపీ రాజకీయాల్లో  చోటు  చేసుకున్న పరిణామాలతో జనసేన, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం కూడ లేకపోలేదు.  టీడీపీకి జనసేన దగ్గరైందనే సంకేతాలు ఇచ్చింది. ఇందుకు  ఊతమిచ్చేలా  పవన్ కళ్యాణ్ రెండు దఫాలు చంద్రబాబుతో సమావేశమయ్యారు.   ఎన్డీఏ పక్షాల సమావేశాన్ని రేపు న్యూఢిల్లీలో నిర్వహించనుంది.ఈ సమావేశానికి  జనసేనకు కూడ బీజేపీ ఆహ్వానం పంపింది. దీంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  న్యూఢిల్లీకి చేరుకున్నారు.

2024  ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు . వైఎస్ఆర్‌సీపీని అధికారంలోకి రాకుండా  అనుసరించాల్సిన వ్యూహంపై  రేపటి భేటీలో చర్చించే అవకాశం ఉంది.