నాడు అమరావతికి ఒప్పుకొని నేడు మూడు రాజధానులంటారా?:జగన్ పై పవన్ ఫైర్

అధికారంలో లేని సమయంలో అమరావతికి కట్టుబడి ఉంటామని చెప్పిన వైసీపీ నేతలు ప్రకటించారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక  మూడు రాజధానుల అంశం తెరమీదికి తీసుకువస్తారా అని ఆయన అడిగారు. 

Jana sena Chief Pawan Kalyan Fires on Ys Jagan Over Three capitalcities

గుంటూరు: ఆనాడు అమరావతికి ఒప్పుకుని ఇప్పుడు మూడు రాజధానులు అంటారా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.జనసేన లీగల్ సెల్ సమావేశం ఆదివాంర నాడు గుంటూరులో నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరావతికి ఇన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని తాను ఆనాడు ప్రకటించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పాలసీ పరంగానే నిర్ణయాలుండాలన్నారు. కానీ వ్యక్తిగతంగా నిర్ణయాలు ఉండకూడదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో బలం ఉన్నందున ఏదైనా చేస్తామని వైసీపీ ముందుకు వెళ్లడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు బట్టారు. మెజారిటీ ప్రజలు నమ్మింది సరైంది అవాలని లేదని  నానీ ఫాల్కీ వాలా  వ్యాఖ్యలను   పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా  ప్రస్తావించారు.

అన్నీ ఆలోచించిన తర్వాతే 2014లో టీడీపీకి మద్దతిచ్చినట్టుగా చెప్పారు. అయితే దీనికి దారి తీసిన పరిస్థితులను కూడా ఆయన వివరించారు 2009లో ప్రజా రాజ్యం పార్టీ అంశాలను కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.  పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనే తనకు నిర్ధిష్ట లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్పారు. సమాజంలో మార్పు కోసం తన వంతు  ప్రయత్నం చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. 
. వెనుకబడిన, అణగారిన కులాలకు అండగా ఉంటానని మాటిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకోవడమే తాను తన జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా ముందుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను పార్టీ వదిలిపెట్టి పారిపోతారని అందరూ  అనుకున్నారన్నారు.  కానీ తన లక్ష్యం కోసం తాను ముందుకు సాగుతానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.  తన వద్ద అపరిమిత ధనం లేదన్నారు. ప్రజల కోసం పనిచేయాలనే తపన తనకు ఉందని చెప్పారు.  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే తన హీరో అని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుండి 67 సీట్లే వస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఈ మేరకు సర్వే రిపోర్టులు చెబుతున్నాయన్నారు. ప్రజల్లో జనసేన పట్ల ఆదరణ పెరుగుతుందన్నాు. వైసీపీపై ప్రజల్లో ఆదరణ తగ్గుతుందని ఆయన వివరించారు. పార్టీ సన్నద్ధతపై కొన్ని సూచనలు వచ్చాయన్నారు.  అన్ని ఆలోచించే యాత్రను వాయిదా వేస్తున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కౌలు రైతుల భరోసా యాత్ర జనసేన-జనవాణిని పూర్తి చేస్తామని పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పారు.
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios