చిన్నమ్మకు తమిళనాడులో అయితే పోయెస్ గార్డెన్ కు జైలుకు పెద్ద తేడా వుండదు కాబట్టి.
తమిళనాడు చిన్నమ్మ అలియస్ శశికళ తనను చెన్నై జైలుకు మార్చాలంటూ విజ్ఞప్తి చేసుకున్నారు. ఆదానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష పడటంతో శశికళ ప్రస్తుతం బెంగుళూరుకు దగ్గరలోని పరప్పణ జైలులో ఉన్నారు. అయితే, ఇక్కడ తనకు ప్రాణహాని ఉందని చిన్నమ్మ పేర్కొనటం గమనార్హం. తనకు నమ్మినబంటు పళనిస్వామి తమిళనాడు సిఎం అయిన తర్వాతనే చిన్నమ్మకు పరప్పణలో ప్రాణహాని భయం మొదలైంది.
విధి వక్రించింది కానీ చిన్నమ్మ దశాబ్దాల పాటు రాజభోగాలను బాగానే అనుభవించింది. అయితే, కాలం ఎల్లకాలం ఒకలాగే ఉండదు కదా. జయ మరణంతో చిన్నమ్మకు సమస్యలు మొదలయ్యాయి. దాంతో తనపై ఉన్న కేసులో అంతిమతీర్పు రావటంతో మళ్లీ జైలు పాలయ్యారు. సంవత్సరాల తరబడి రాజభొగాలకు అలవాటు పడిన శశికళ కఠిక నేలపై పడుకోలేకపోతున్నారు. దాంతో తనను అర్జెంటుగా చెన్నై జైలుకు మార్చాలంటూ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. ఒకవేళ అధికారులు గనుక శశికళను తమిళనాడుకు తరలించాలని నిర్ణయిస్తే ఇక చిన్నమ్మకు మళ్లీ రాజభోగాలే. ఎందుకంటే, చిన్నమ్మకు తమిళనాడులో అయితే పోయెస్ గార్డెన్ కు జైలుకు పెద్ద తేడా వుండదు కాబట్టి.
