ఏదో......పాలు, కూరగాయలమ్ముకుని బతికేస్తున్నారు

First Published 9, Mar 2017, 11:17 AM IST
Jagans sakshi harassing vegetable vendor Nara family
Highlights

ఏదో పాపం పూట గడవటం కోసం పాలు, కూరగాయలు అమ్ముకుని బ్రతుకున్నారు చంద్రబాబునాయుడు కుటుంబం.

ఏదో పాపం పూట గడవటం కోసం పాలు, కూరగాయలు అమ్ముకుని బ్రతుకున్నారు చంద్రబాబునాయుడు కుటుంబం. కనీసం ఆ మాత్రం కూడా కనికరం కూడా లేకుండా సాక్షి వాళ్ళు లోకేష్ పై ఎందుకు బురదచల్లుతున్నారో అర్ధం కావటం లేదు. పోయిన అక్టోబర్లో ప్రకటించిన ఆస్తులకు తాజాగా చూపించిన అఫిడవిట్ లోని అస్తులకు మధ్య 23 రెట్లు వ్యత్యాసమున్నంత మాత్రాన నీతి, నిజాయితీకి మారురూపమైన నిప్పు చంద్రబాబు వారసునిపై అంతేసి వార్తలు రాయాలా? మొన్నటి అక్టోబర్ లో రూ. 14.50 కోట్ల ఆస్తులు ఇప్పటికి రూ. 330 కోట్లైనంత మాత్రాన అంత యాగీ చేయాలా? ఏదో భగవంతుడి దయతో తమ హెరిటేజ్ షేర్ మార్కెట్ ధర రూ. 1210 కి చేరుకున్నందు వల్ల సంపద పెరిగిందని లోకేష్ చెప్పారు కదా. పైగా షేర్ విలువ మార్కెట్ ధరను చూపాల్సి వచ్చింది కాబట్టే చూపుతున్నానని పదే పదే చెప్పారు.

 

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేద్దామనే తాను ఎంఎల్సీగా అడుగుపెడుతున్నట్లు కూడా చెప్పారు. అదేదో ప్రకటనలో భక్తునికి-భగవంతునికి అనుసంధానం లాగనుకోండి. నీతి, నిజాయితీతో బ్రతుకుతున్న తమపై జగన్ అనవసరంగా బురద ఎందుకు చల్లుతున్నట్లో అర్ధం కావటం లేదన్నారు. జగన్ లాగ క్విడ్ ప్రోకోకు పాల్పడాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన తండ్రిపై పెట్టిన 40 కేసుల్లో ఇంత వరకూ ఒక్కదాన్ని కూడా నిరూపించలేకపోయినట్లు చెప్పారు. అయితే, ఓటుకునోటు కేసు గురించి మాత్రం ప్రస్తావించలేదు. 16 కేసుల్లో స్టేలపై కంటిన్యూ అవుతున్న విషయాన్ని కూడా లోకేష్ మరచిపోయినట్లున్నారు. చివరకు లోకేష్ చెప్పిందేమంటే, సాక్షి దినపత్రిక చదవకండి, సాక్షి ఛానల్ చూడకండి అని.

loader