Asianet News TeluguAsianet News Telugu

జగనన్న విద్యా కానుక ప్రారంభించిన జగన్: కిట్‌లో ఏమున్నాయంటే..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘‘జగనన్న విద్యా కానుక ’’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్ధులందరికీ అవసరమైన సామాగ్రిని ఈ కిట్‌లో ప్రభుత్వం అందజేసింది. 

jagananna vidya kanuka free kit ksp
Author
Amaravathi, First Published Oct 8, 2020, 2:40 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘‘జగనన్న విద్యా కానుక ’’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్ధులందరికీ అవసరమైన సామాగ్రిని ఈ కిట్‌లో ప్రభుత్వం అందజేసింది. ఈ కిట్లలో 3 జతల యూనిఫారాలు(క్లాత్‌), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌ బ్యాగ్‌ ఉంటాయి.

బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందించారు. కోవిడ్‌ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేశారు. యూనిఫామ్‌ కుట్టించుకునేందుకు మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తున్నారు.

అంతేకాదు ‘జగనన్న విద్యాకానుక’ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 91212 96051, 91212 96052 హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్రదించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది

Follow Us:
Download App:
  • android
  • ios