అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీలో తన కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న రాజకీయంపై సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. వర్షానికి తడిసిముద్దై, మడుగులాగ తయారైన తన ఛాంబర్ విషయాన్ని ఇప్పటికే జగన్ పార్టీ నేతలతో చర్చించారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదివారం అమరావతికి వెళుతున్నారు. న్యూజిల్యాండ్ పర్యటనలో ఉన్న జగన్ శనివారం రాత్రికి హైదరాబద్ కు చేరుకుంటారు. రాగానే అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీలో తన కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న రాజకీయంపై సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
వర్షానికి తడిసిముద్దై, మడుగులాగ తయారైన తన ఛాంబర్ విషయాన్ని ఇప్పటికే జగన్ పార్టీ నేతలతో చర్చించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా పరిశీలించారు.
అందులో భాగంగానే హైదరాబాద్లో పార్టీ నేతలతో సమావేశం తర్వాత ఆదివారం విజయవాడకు చేరుకుంటారు. వెంటనే వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీలోని తన కార్యాలయాన్ని పరిశీలిస్తారు. అయితే, వర్షం లీకులతో మడుగులాగ తయారైన జగన్ ఛాంబర్ రూపురేఖలను అసెంబ్లీ సిబ్బంది ఇపుడు పూర్తిగా మార్చేసారు. ఈ విషయంపైన కూడా జగన్ పార్టీ నేతలతో మాట్లాడినట్లు సమాచారం.
అనంతరం అక్కడి నుండి విశాఖపట్నంకు వెళతారు. విశాఖపట్నం జిల్లాలో బయబపడిన భారీ భూ కుంభకోణంపై స్ధానికులతో సమావేశమవుతారు. కుంభకోణానికి దారితీసిన పరిస్ధితులు, ఎవరి పాత్ర ఎంతెంత అన్న విషయాలపై బాదితులతో మాట్లాడుతారు.
