Asianet News TeluguAsianet News Telugu

జగన్ కొత్త ‘టివి వ్యూహం‘

'టిడిపి ఉడుంపట్టు'లో ఉన్న  కేబుల్ ఆపరేటర్ల నుంచి సాక్షి  ఛానెల్ ని కాపాాడుకునేందుకు జగన్ తాజా వ్యూహం.

Jagan to counter TDP control over cable operators

ఆంధ్రలో తొందరలో  టివి ప్రసారాలు ప్రభుత్వం చేతుల్లోకి పోతూ ఉండటంతో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రానున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దమవుతూ ఉన్నట్లుంది. సాక్షి  ప్రసారాలను కేబుల్ అపరేటర్లు అపేసినా నష్టం లేని వ్యూహం రూపొందించారు. అదే సబ్సిడీ డిష్ విధానం. ఇది అనంతపురం లో మొదలయింది.

 

 ,  ఈ మధ్య వ్యతిరేక వార్తల  ప్రసారాలను అడ్డుకునేందుకు దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు చూపించి ప్రభుత్వాలు టివిచానెళ్లను నిషేధిస్తున్నాయి.

 

తాజాగా  కేంద్రం ఎన్ డి టివి ప్రసారాలను నిలిపివేసేందుకు ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రజల్లో బాగా వ్యతిరేకత రావడంతో  ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేశారు. ఆ మధ్య తెలంగాణాలో టివి9, ఎ బి ఎన్ ఆంధ్రజ్యోతి చానెళ్ల ను ‘కేబుల్ అపరేటర్లు’ మూసేశారు.  ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో ముద్రగడ కాపు ఉద్యమం సమయంలో  తెలుగుదేశం ప్రభుత్వం పలు ఛానెళ్ల మీదఆంక్షలు విధించింది. అందులోప్రధాన మయింది జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి చానెల్.

 

 ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లందరిని రూలింగ్ పార్టీలు తమ గుప్పిట్లో పెట్టకుంటున్నాయి.

 

అధికార పార్టీ వాళ్ల ఆదేశిస్తే కేబుల్ ఆపరేటర్లు సాక్షి  ప్రసారాలు ఆపేసే ప్రమాదం ఉంది . ఈ ప్రమాదం వచ్చేంతవరకు అగకుండా, జాగ్రత్త పడుతున్నారు వైఎస్ ఆర్ పార్టీనేతలు. ఇది ఒక మూల అనంతపుంర నుంచి మొదలయింది.

 

అనంతపురం జిల్లాలో కేబుల్‌ వ్యవస్థ మొత్తం టీడీపీ నేతల చేతిలో,  ముఖ్యంగా పరిటాల సునీత అనుచరుల చేతిలో ఉందని చెబుతారు. అక్కడి నుంచి ఆదేశాలు వస్తే వెంటనే సాక్షి ఛానల్‌ ఆగిపోతాయనే  అనుమానాలు జిల్లా వైఎస్ ఆర్ సి నాయకులలో ఉన్నాయి. ఎందుకంటే,  కాపు ఉద్యమ సమయంలో అత్యధిక కాలం సాక్షి ప్రసారాలు ఆగిపోయింది అనంతపురంలోనే.

 

 ‘ఆ మధ్య పరిటాల శ్రీరామ్ అనుచరుడు నగేష్ చౌదరి బోయ ఓబిలేసును అనే వ్యక్తిని  చావ మోదిన  వీడియే సాక్షి మాత్రమే ప్రసారం చేసింది. అపుడు సమయంలో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో సాక్షి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజవకర్గంలోనూ సాక్షి ప్రసారాలకు పదేపదే ఆటంకం కలిస్తుంటారు టీడీపీ నేతలు,’ అని వైఎస్ ఆర్ సినాయకుడొకరు చెప్పారు.

 

ముందు ముందు ఇలాంటి అంతరాయం లేకుండా ఉండే ప్యయత్నాలు మొదలుపెట్టారు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ తోపుదుర్తి ప్రకాశ్‌.

 

తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన సబ్బిడి ధరలకు డిష్‌ టీవీ కనెక్షన్ ఇస్తున్నారు. రెండు వేల విలువ చేసే డిష్ టీవీ కనెక్షన్‌ను ట్రస్ట్‌ ద్వారా కేవలం రూ 550 లకే అందచేస్తున్నారు.

 

పరిటాల శ్రీరామ్‌ గ్యాంగ్‌ నుంచి  టివి ప్రసారాలను కాపాడుకునేందుకు  డిష్‌ టీవీ కనెక్షన్లు అందిస్తున్నామని, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో భాగమేనని ప్రకాశ్‌ చెప్పారు.

 

 సాక్షి ఛానల్‌ ద్వారా పరిటాల దౌర్జన్యాలు ప్రజలకు తెలిసేలా చేసేందుకే ప్రతి ఒక్కరికీ డిష్ టీవీ కనెక్షన్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇష్టమైన న్యూస్ ఛానల్‌ వీక్షించాలన్నా టీడీపీ కేబుల్‌ ఆపరేటర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాల్సివస్తున్నదని , ఇక నుంచి వారి పెత్తనం నుంచి టివిప్రసారాలను కాపాడేందుకే ఇందంతా అని తోపుదుర్తి ప్రకాశ్ చెబుతున్నారు. 

 

ఈ విధానం అన్ని జిల్లాలలో కూడా అమలు చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే,ముఖ్యమంత్రి రు.149  టివి  ప్రసారాలు, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం  ఇస్తున్నపుడు ఈ వ్యూహం పనిచేస్తుందా???

 

 

Follow Us:
Download App:
  • android
  • ios