నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కి జగన్ ఊహించని షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ స్థానాన్ని నేదరుమల్లి రామ్ కుమార్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయనకు టికెట్‌ ఇవ్వకపోగా.. ఆయన ప్రత్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి ఈ స్థానం అప్పగించారు.

 రామ్‌కుమార్‌రెడ్డి తండ్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున 1989లో వెంకటగిరి నుంచే జనార్దన్‌రెడ్డి విజయం సాధించి.. మంత్రిగా, సీఎంగా కూడా పనిచేశారు. తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి వెంకటగిరి నుంచి 1999, 2004ల్లో వరుసగా రెండుసార్లు కాంగ్రె స్‌ తరపున గెలిచారు. 

2004 నుంచి 09 వరకు రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు వైసీపీలో టికెట్ దక్కుతుందనే ఆశతోనే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు.