ప్లీనరీకి ఏపి, తెలంగాణాలోని అన్నీ జిల్లాల నుండి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పార్టీ ప్రారంభించి నాలుగు సంవత్సరాలైనప్పటికీ ఇంత భారీ ఎత్తున ప్లీనరీని నిర్వహించటం మాత్రం ఇదే తొలిసారి.

వేలాదిమంది నేతలు, పార్టీ శ్రేణుల మధ్య వైసీపీ ప్లీనరీ ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు తన ప్రారంభోపన్యాసంతో ప్లీనరీ ప్రారంభిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. విజయవాడ-గుంటూరు మధ్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న 150 ఎకరాల స్ధలంలో మూడురోజుల ప్లీనరీ ప్రారంభమైంది. ఈ ప్లీనరీకి ఏపి, తెలంగాణాలోని అన్నీ జిల్లాల నుండి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పార్టీ ప్రారంభించి నాలుగు సంవత్సరాలైనప్పటికీ ఇంత భారీ ఎత్తున ప్లీనరీని నిర్వహించటం మాత్రం ఇదే తొలిసారి.

ఇడుపులపాయ నుండి 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ తర్వాత ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే వేదిక వద్ద పార్టీ ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులందరూ ఉన్నారు. 12 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న జగన్ నేతలందరినీ పేరు పేరునా పలకరించారు. తర్వాత 12.30 గంటలకు లాంచనంగా పదినిముషాల పాటు ప్రసంగించారు. తర్వాత పార్టీ తరపున 20 తీర్మానాలను ఆయా జిల్లాల అధ్యక్షులు ప్రవేశపెట్టారు.పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలపై ఆదివారం చర్చలు జరుగుతాయి. తర్వాత ఆమోదాలు ఎటూ ఉంటాయనుకోండి