Asianet News TeluguAsianet News Telugu

బాబు వచ్చాడు... రాజ్యాంగం పోయింది

ముందుండి  ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన వ్యక్తి,  సొంత ప్రయోజనాల కోసం రాష్టాన్ని అమ్మే ప్రయత్నంచేస్తున్నారు

Jagan says naidu overseeing the rape of democracy in AP

మనరూల్స్ మనం రాసుకుని మనం స్వతంత్రంగా బతికేందుకు ప్రకటించుకున్నదినం నేడు. ఈ నియమాలను తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని అభాసు పాలు చేస్తున్న ఒక దుర్ముహూర్తంలో ఈ 68 వ గతతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు బాధ గా ఉందని ప్రతిపక్ష నాయకుడు, వైసిపి నేత జగన్మోహన్ రెడ్డి అన్నారు.

 

కొద్ది సేపటి కిందట ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం జాతీయ పతాకం ఎగురవేసి ప్రసంగించి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గిర ఉండి, గణ తంత్రదిన ఆశయాలు, స్ఫూర్తిని ఎలా అవమాన పరస్తున్నారో వివరించారు.

 

 ‘ఇవాళ మనరాష్ట్రంలో... మన రూల్స్, రాజ్యాంగం అమలవుతున్న తీరు చూస్తే... ఇదిప్రజాస్వామ్యంలాగా ఉందా అని అడుతున్నా. 68 సం. అయింది, ఇపుడు మనమంటున్నది ప్రజాస్వామ్యం లేకా బ్రిటిష్ కాలంలోనా ?’ అని జగన్ ప్రశ్నించారు.

 

మన పవిత్రమని భావించే రూల్స్ ని పాలకులే...అధికారంలో ఉన్నవారే , దగ్గిర ఉండి నీరుకారుస్తుంటే ఇది  ప్రజాస్వామ్యమా అని అనుమానం వస్తున్నదని అన్నారు.

 

ఆయన అన్నమాటలివి:

 

అధికార పక్షం, ప్రతిపక్షం అంతా కలసి రాష్ట్రాన్ని విడగొడతున్నపుడు ప్రత్యేక హోదా అని  మాట ఇచ్చారు. ఈ హమీకి దరెండున్నరేళ్లయినా దిక్కు లేకుండా పోయింది. ప్రతిపక్షం, అధికారం పక్షం కలసి ఇచ్చిన హామీ ఇది. ఈ రోజు, రిపబ్లిక్ డే సందర్భంగా,  పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ ఎమవుతున్నదో చూస్తున్నాం.

 

ముందుండి  ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన వ్యక్తి, తన  సొంత ప్రయోజనాల కోసం రాష్టాన్ని అమ్మే ప్రయత్నంచేస్తున్నారు.

 

విశాఖ లో ఎం జరుగుతున్నదో చూడండి . వాకింగ్ కు కూడా అనుమతించడం లేదు. అక్కడ కాలు మోపలేని పరిస్థితి. అందరిని అరెస్టు చేస్తున్నారు.  హౌస్ అరెస్టులు. దగ్గిర ఉండి అరెస్టులు చేయిస్తున్నారు. కారణం, శాంతియుతంగా, ప్రజాస్వామ్యం బద్ధంగా పార్లమెంటు లో ఇచ్చిన మాట మేరకే ప్రత్యేక హోదా ఇవ్వండని అడగటమే. దగ్గిర ఉండి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానిన అణచి వేస్తున్నారు.

 

ఇదే కాదు, ఎమ్మెల్యేల విషయంలో ఇలా గే  ఉంది. ఒక పార్టీ గుర్తు మీద గెల్చిన వాళ్లను దగ్గిరుండి ముఖ్యమంత్రి కొనుగోలు చేస్తున్నారు. పార్టీ మారితే రాజీనామా చేయాలి. అయితే, ఈ రాజ్యాంగ నియమం తుంగలో తొక్కి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు కోట్లు ఖర్చుచేసి. ఇలాంటి తప్పులు చేస్తున్న వ్యక్తి జైలులోఉండాలి. అయితే, ఆయన 20నుంచి 30 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు.

 

రాజధాని నిర్మాణంతో పేరుతో దళితులను, వారి భూములనుంచి బలవంతంగా వెళ్లగొడుతున్నారు. వాళ్ల భూములను లాక్కుంటున్నారు. అవి అసైన్డు భూములని వారికి  తక్కువ పరిహారం ఇస్తున్నారు. ఈ వివక్ష ఎందుకు. ఇదంతా ముఖ్యమంత్రి దగ్గిరుండి జరిపిస్తున్నారు.

 

ప్రజాస్వామ్యంలో , రాజ్యాంగంలో ఉన్న ప్రతివిషయాన్ని దగ్గిరుండి ఉల్లంఘిస్తున్నారు.

 

ముద్రగడ హౌస్ అరెస్టు ఏమిటి?

 

ప్రజాస్వామ్యంలో నిరసనకు హక్కు లేదా?

 

ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులు అడుగుతున్న దేమిటి?

 

చంద్రబాబు నాయుడ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ‘కాపులకు రిజర్వేషన్లు’ అమలు చేయాలని అడగడమే వారు చేసిన నేరమే. దానికి  ముద్రగడ మీద నిర్భంధం, భార్యమీద దౌర్జన్యం.

 

చంద్రబాబు నాయుడ ఎంత భాగా ఎన్నికల హామీలు చేశారు, గోడల మీద రాశారు,ఫ్లెక్సీల మీద  రాశారు. అవి కనబడతాయో లేదో అని భారీ లైట్ల వెలుగులో ప్రజలకు ఈ హామీ లను చూపించారు.

 

బాబు వస్తే జాబు అన్నారు, బాబు వస్తే రుణమాఫీ అన్నారు.బాబు వస్తే రుణాలన్నావు.

 

ఎవీ ఈ హమీలు... ఇవి అడిగితే నిర్భంధం.

 

ఇది బాబు గారి ప్రజాస్వామ్యం

 

 

Follow Us:
Download App:
  • android
  • ios