అమరావతి: కాల్‌మనీ సెక్స్ రాకెట్  విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా చర్యలు తీసుకోవాలని  ఆయన ఆదేశాలు జారీ చేశారు.

మంగళవారం నాడు అమరావతిలో కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఏపీ సీఎం ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ చోటు చేసుకోవడం దారుణమన్నారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తిని అరికట్టేందుకు ఆగష్టు మాసంలో భారీ ఆపరేషన్‌ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.  గంజాయిని సాగు చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను చూపాలని జగన్ ఉన్నతాధికారులకు సూచించారు.

గంజాయి సాగు చేసే గిరిజనును కాఫీ ప్లాంటేషన్‌ను పెంచేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. కాలుష్యం వెదజల్లే  పరిశ్రమల పట్ల అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి రాష్ట్రంలో  బెల్ట్‌షాపులను ఎత్తివేయాలని ఆయన ఆదేశించారు.జాతీయ రహదారుల వెంట లిక్కర్ అమ్మకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. జాతీయ రహదారుల వెంట మద్యం షాపులను ఎత్తివేయాలని  ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

త్వరలోనే పోలీసు శాఖలోఖాళీలు భర్తీ: సుచరిత