పదిహేనో ఆర్థిక సంఘం నివేదిక నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  లేఖ రాశారు. దీనిని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం అర్థరాత్రి మీడియాకు విడుదల చేసింది. 

వివిధ రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని... ఇది ఆర్థిక సంఘం పరిధిలోని అంశం కాదని కేంద్ర ప్రభుత్వమే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని  15వ ఆర్థిక సంఘం తన నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Also Read ఆందోళనలకు కౌంటర్: వైఎస్ జగన్ తో అమరావతి రైతుల భేటీ.

విభజనతో ఆాంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని , తెలంగాణకే ఎక్కువ ఆదాయం వెళ్లిందని.. అందువల్ల తమ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని సీఎం జగన్ కోరారు. కేంద్ర బడ్జెట్ ఎంతో ఆశాజనకంగా ఉన్నా రాష్ట్రానికి తగిన కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తదికి లోనైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ప్రత్యేక హఓదా విషయంలో 14వ ఆర్థిక సంఘం చేసిన సూచనలకు, 15వ ఆర్థిక సంఘం నివేదికకు మధ్య వైరుధ్యం ఉందని జగన్ పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నివేదికలోని అంశాలను పరిశీలించి ప్రత్యేక హోదాను ప్రకటించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధానిని కోరారు.