జడ్జీలతో చంద్రబాబు భేటీ ప్రయత్నాలా ?

జడ్జీలతో చంద్రబాబు భేటీ ప్రయత్నాలా ?

ఢిల్లీ పర్యటనలో చంద్రబాబునాయుడు న్యాయమూర్తులను కలిసేందుకు ప్రయత్నించారా? జగన్ కే చెందిన మీడియా అవుననే అంటోంది. ప్రత్యేకహోదా, అవిశ్వాస తీర్మానానికి మద్దతు పేరుతో ఢిల్లీలో చంద్రబాబు మకాం వేయటంలో అసలు ఉద్దేశ్యాలు వేరని సదరు మీడియా చెబుతోంది. ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే ముసుగులో ఢిల్లీలోని కొందరు న్యాయమూర్తులను కలవటమే చంద్రబాబు రహస్య అజెండాగా ఆ మీడియా ఆరోపిస్తోంది.

ఓటుకునోటు కేసుతో పాటు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబులో కేసుల భయం పట్టుకుందని మీడియా అంటోంది. తనపై కేసుల్లో ఎటువంటి విచారణ జరగకుండా ముందస్తు జాగ్రత్తల కోసమే కొందరు న్యాయమూర్తులను చంద్రబాబు తెరచాటు ప్రయత్నాలు చేసినట్లు మీడియా చెబుతోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos