Asianet News TeluguAsianet News Telugu

అంగన్ వాడీల కన్నీటిలో జగన్ కొట్టుకుపోతాడు - అచ్చెన్నాయుడు

అంగన్ వాడీ సిబ్బంది (anganwadi workers protest in andhra pradesh) కన్నీటిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) కొట్టుకుపోతారని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు (andhra pradesh TDP President Kinjarapu Atchannaidu) అన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన చేస్తే నేరమెలా అవుతుందని ప్రశ్నించారు.

Jagan is washed away in tears by the Anganwadi staff - Achchennaidu..ISR
Author
First Published Jan 22, 2024, 4:11 PM IST

అంగన్ వాడీ సిబ్బందిపై పోలీసులు దురుసు ప్రవర్తనను టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశాడని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలపడం కూడా తప్పా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ తీరు దుర్మార్గమని అన్నారు.

రేపటి నుంచి భక్తులకు బాల రాముడి దర్శనం.. ఏటా 50 మిలియన్లకు పైగా పర్యాటకులు వచ్చే ఛాన్స్

ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టడంతో తాడేపల్లి ప్యాలెస్ (ఏపీ సీఎం జగన్ అధికారిక నివాసం)లో వణుకు పుట్టిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అంగన్వాడీలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు దుర్మార్గంగా ఉందని విమర్శించారు. 

అంగన్ వాడీలతో చర్చలు జరపకుండా ఈడ్చేస్తారా ? ఇది అప్రజాస్వామికం - పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని సీఎం పాతరేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ తన సొంత జాగీరులా జగన్ రెడ్డి భావిస్తున్నారని అచ్చెన్నాయడు ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన చేస్తే నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. అంగన్వాడీ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించే అధికారం సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారని అన్నారు. అంగన్వాడీల కన్నీటిలో జగన్ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ఆచం సునీతను అరెస్ట్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

500 ఏళ్ల నిరీక్షణకు తెర.. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట పూర్తి.. భావోద్వేగానికి గురైన భక్తులు

కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీలు ప్రభుత్వానికి నిరసనలు తెలుపుతున్నారు. వేతనాల పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. గత 42 రోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ముందుగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. 

ప్రాణ ప్రతిష్ఠతో రామ రాజ్యం ప్రారంభం - శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్

ఆదివారం అర్థరాత్రి విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీలు చేపట్టిన నిరాహాక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. అంగన్ వాడీలపై పోలీసుల దురుసు ప్రవర్తన ఖండిస్తున్నామని చెప్పారు. చిరుద్యోగులతో చర్చలు జరపాలని కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios