జగన్ అక్రమాస్తుల కేసు : వైఎస్ భారతీరెడ్డిపై ఈడీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం..

జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్ భారతీరెడ్డిపై ఈడీ ధాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాము ఇందులో జోక్యం చేసుకోమని తెలిపింది. 

Jagan illegal assets case : Supreme Court dismisses A petition against YS Bharathi Reddy - bsb

ఢిల్లీ : వైయస్ భారతి రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనుమతుల తీర్పును సవాలు చేస్తూ ఈడి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ జగన్ ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా వాటికి సమాన విలువైన నగదు డిపాజిట్లు సమర్పించవచ్చని జగన్ భార్య వైయస్ భారతీరెడ్డికి తెలంగాణ హైకోర్టు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఈడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తెలంగాణ హైకోర్టు వైయస్ భారతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ సుప్రీంకోర్టులో ఈడి సవాలు చేసింది. దీనిని శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ కరోల్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈడీ సవాలు చేసిన పిటిషన్లను విచారించింది. ఈడీ న్యాయవాదిని ఉద్దేశించి ఈ కేసులో సవాలు దేనికి చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.

త్వరలో సింగూరు పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేస్తారు.. మంత్రి రోజా

దీనికి ఈడీ తరపు న్యాయవాది సమాధానం చెబుతూ… జప్తు చేసిన ఆస్తులకు ప్రత్యామ్నాయ ఆస్తులను  జప్తు పరిధిలోకి తీసుకురావడాన్ని.. ఈడీ సవాలు చేస్తోందని.. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు పేర్కొన్నారు. దీనిమీద ఆయన ఇంకా వివరంగా మాట్లాడుతూ అక్రమార్జన ద్వారా సంపాదించిన డబ్బుతో ఒక యాభై లక్షలు పెట్టి ఓ స్థలం కొంటే.. ఆ తరువాత ఆ ఆస్తి విలువ ఐదు కోట్లకు చేరుకుంటుంది.  

దీనికి రూ. 50 లక్షల మేర నగదు డిపాజిట్లు చేస్తే సరిపోదు కదా? అని ఈడి తరఫునుంచి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండానే ఈ పిటిషన్ను  కొట్టివేయవచ్చంటూ ఏఎస్జి అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. మీరు ఇప్పుడు అసలు విషయానికి వచ్చారంటూ వ్యాఖ్యానించింది. షేర్ల ముఖ విలువను ఎఫ్డీల విషయంలో ఎలా నిర్ధారిస్తారు?  షేర్ ధర ఎప్పుడు.. ఎలా.. ఉంటుందో ఎవరికి తెలియదుగా అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.  

ఈ సందర్భంలోనే వైయస్ భారతి తరపు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి తమది ప్రైవేట్ కంపెనీ అని సమాధానమిచ్చారు. అక్రమార్జన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అక్రమార్జన లభ్యం కాకపోతే ఈడి సాధారణంగా దానికి సమాన విలువైన ఆస్తులను జప్తు చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జప్తు చేసిన షేర్లు అక్రమార్జన ద్వారా సంపాదించినవి కావని చెప్పారు. 

ధర్మాసనం వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా.. జప్తు చేసిన రోజు ఒక్కో షేర్ ముఖ విలువ 10 రూపాయలు ఉందని సమాధానం చెప్పారు. అయితే హైకోర్టు జప్తు చేసిన ఆస్తులు అక్రమార్జనవి కావని అభిప్రాయ పడిందని.. ఈ అభిప్రాయంతో ఈడి విభేదించినందున ఈ పిటిషన్ లో ధర్మాసనం జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తుందని పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios