త్వరలో సింగపూర్ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేస్తారు.. మంత్రి రోజా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వలోనే సింగపూర్ పోలీసులు వచ్చి చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నారని అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వలోనే సింగపూర్ పోలీసులు వచ్చి చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నారని అన్నారు. అమరావతిలో చంద్రబాబు అనేక కుంభకోణలు చేశారని ఆరోపించారు చంద్రబాబు ఆయన పార్టనర్ అయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి చీకటి కుంభకోణాలు చేశారని రోజా విమర్శలు గుప్పించారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ ను అక్కడి ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించి విచారణ జరుపుతున్నట్లు రోజా చెప్పుకోచ్చారు.
అమరావతి భూముల్లో స్విస్ చాలెంజ్ పేరుతో కుంభకోణాలు చేశారని.. త్వరలోనే సింగపూరు పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసి చిప్పకూడు పెడతారని వ్యాఖ్యానించారు. ఆ భయంతోనే చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రావడం లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ ఉసురు తగులుతుందని చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తారని అని చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా రోజా విమర్శిలు గుప్పించారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ పిచ్చి గంతులేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. కోవిడ్ సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో దాక్కున్నారని అన్నారు. వారికి చప్పట్లు కొట్టేవారికి కూడా కోవిడ్ సమయంలో సేవలందించింది వాలంటీర్లేనని అన్నారు. పవన్ సంస్కారం గురించి చెప్తుంటే సన్నీలియోన్ వేదాలు వల్లించినట్టుందని ఆమె విమర్శించారు.