గ్రామ, వార్డు మహిళా పోలీసులకు గుడ్ న్యూస్.. సీఐ వరకు పదోన్నతి పెంచనున్న జగన్ సర్కార్...

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న దాదాపు  15 వేల మంది మహిళా పోలీసులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు.  మహిళా  పోలీసులకు కానిస్టేబుల్ హోదా ఇవ్వడంతో ఇప్పటికే  వారు హోం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

jagan government good news to andhra pradesh village and ward women police, will get promotions upto CI

అమరావతి :  గ్రామ, వార్డు మహిళా పోలీసుల ఉద్యోగాలను త్వరలో క్రమబద్దీకరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత ప్రోత్సహించనుంది. క్షేత్ర స్థాయిలో మహిళల రక్షణ కోసం కీలకంగా వ్యవహరించే మహిళ పోలీసులకు పదోన్నతులు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.  అందుకోసం ముసాయిదా బిల్లును రూపొందించింది.  రానున్న అసెంబ్లీ సమావేశాల్లో  ఈ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి.

పోలీసు శాఖలో ప్రత్యేక వ్యవస్థగా…
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత YS Jaganmohanreddy విప్లవాత్మక రీతిలో Village, Ward Secretariat system ను ఏర్పాటు చేశారు.  పోలీస్ స్టేషన్కు వచ్చేందుకు మహిళలు వెనుకంజ వేస్తున్నందున వారి సమస్యలను  స్థానికంగానే గుర్తించి పరిష్కరించేందుకు  గ్రామ, వార్డు సచివాలయాల్లో  దాదాపు  15 వేల మంది Women policeలను నియమించారు. వారికి కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది.

వారి సర్వీసులను ప్రభుత్వం త్వరలోనే క్రమబద్దీకరించనుంది. అందుకోసం  రాత పరీక్ష,  ప్రాజెక్టు వర్క్ లో ఇప్పటికే పూర్తి చేసింది కూడా.  ప్రస్తుతం మహిళా పోలీసులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ House Officer పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు.  మహిళా  పోలీసులకు Constable హోదా ఇవ్వడంతో ఇప్పటికే  వారు హోం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.  కానీ వారి హాజరు, సెలవులు మంజూరు,  జీతాల చెల్లింపు అంశాలు  సంబంధిత మున్సిపాలిటీలు,  పంచాయతీల పరిధిలోనే ఉన్నాయి.

దీంతో క్షేత్ర స్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నాయని Government గుర్తించింది.  మరోవైపు సాధారణ పోలీసులు ఎంపిక ప్రక్రియ నిబంధనలు ప్రత్యేకంగా ఉన్నాయి.  కానీ సామాన్యులతో మమేకం అయ్యేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పోలీసుల ఎంపిక ప్రక్రియ వేరేగా ఉంది. దాంతో సాంకేతికంగా  ఇబ్బందులు రాకుండా మహిళా పోలీసుల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉంది.

Andhra Pradesh: రైతులకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ. 22 కోట్లు జమ చేసిన సీఎం జగన్

అందుకోసం సాధారణ  పోలీసులుగా కాకుండా మహిళ పోలీసులను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయనుంది.  సాధారణ పోలీసులకు సమాంతరంగా Women police system ఉండనుంది. 

పదోన్నతి కి అవకాశాలు కూడా…
 మహిళా పోలీసులకు Promotionsపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుతం గ్రామ,  వార్డు సచివాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు  పదోన్నతుల కోసం ‘ హెడ్ కానిస్టేబుల్,  ఏ ఎస్ ఐ, ఎస్సై, సీఐ’  పోస్టులను ఏర్పాటు చేస్తారు.

- పట్టణ ప్రాంతాల్లో అయితే కొన్ని వార్డులకు,  గ్రామీణ ప్రాంతాల్లో  మండలానికి  ఒక మహిళ హెడ్కానిస్టేబుల్ ఉంటారు.
- పోలీస్ సర్కిల్ స్థాయిలో  మహిళ  ఏ ఎస్ ఐ ఉంటారు.
- పోలీస్  సబ్ డివిజన్ స్థాయిలో  మహిళా ఎస్సై ఉంటారు.
- పోలీస్ జిల్లాస్థాయిలో  మహిళా సీఐ ఉంటారు.

ఈ పదోన్నతుల అంశంపై మరింతగా సమీక్షించి హోంశాఖ తుది ముసాయిదాను ఖరారు చేయనుంది.  అనంతరం బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios