వైఎస్ జగన్ సర్కార్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్డీబీ నిధుల ద్వారా చేపట్టే రహదారుల ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది. రూ.4,600 కోట్లతో 3 వేల కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి టెండర్లను రద్దు చేసింది. రీ టెండర్లు జారీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

అలాగే మరింత మందికి అవకాశం కల్పించేందుకు రీటెండర్లు పిలుస్తున్నామని.. ఎన్డీబీ టెండర్ల విషయంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకూడదనే ఉద్దేశ్యంతోనే రీటెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ఆర్ అండ్ బీ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు.

టెండర్ ప్రాసెస్ పక్కాగా ఉన్నా ప్రభుత్వం పారదర్శకంగా వుందని చెప్పేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణబాబు చెప్పారు.

రోడ్ల నిర్మాణంలో జాప్యం కలిగినా పర్లేదని సీఎం చెప్పారని, కాంట్రాక్టర్లతో సమావేశాలు పెడతామని ఆయన వెల్లడించారు. బిల్లుల చెల్లింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది ఏపీ సర్కార్.