ప్రొద్దుటూరులో జగన్ ఫుల్లు ఖుషీ...

jagan full happy in produttur during his prajasankalpayatra
Highlights

  • జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా ఖుషీ అయిపోయారు.
  • జన సంకల్పయాత్రలో భాగంగా ఐదో రోజు జగన్ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించారు.

జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా ఖుషీ అయిపోయారు. జన సంకల్పయాత్రలో భాగంగా ఐదో రోజు జగన్ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించారు. సాయంత్రం పట్టణంలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఎప్పుడైతే జగన్ ప్రొద్దుటూరు పట్టణంలోకి అడుగుపెట్టారో అప్పటి నుండి జనాలే జనాలు.

ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది కూడా వైసీపీ ఎంఎల్ఏ రాచమల్లు ప్రసాదరెడ్డే. దాంతో ఎంఎల్ఏ తన కెపాసిటీ మొత్తాన్ని చూపించారు.

అందులో జగన్ కూడా రోడ్డు పక్కనున్న టీ బంకుల వద్ద ఆగటం అక్కడి వారితో మాట కలిపారు.

దాంతో టీ షాపు ఓనర్ జగన్ కు టీ ఆఫర్ చేస్తే వద్దన కుండా తాగారు.

ఇంకో చోట కూల్ డ్రింక్ షాపు యజమాని కూల్ డ్రింక్ ఇస్తే తాగారు.

 

ఓ ముస్లిం మహిళ జగన్ తో తన సమస్యలను చెప్పుకున్నది.

 

ఓ కుటుంబమైతే తమ ఏడాది పాపను జగన్ వద్దకు తీసుకొచ్చింది.

దాంతో జగన్ కూడా పాపను ఎత్తుకుని ముద్దాడారు. స్ధానికులు కొందరు జగన్ కు వెండి కిరీటాన్ని బహూకరించటమే కాకుండా తలపై అలంకరించారు.

తర్వాత ప్రొద్దుటూరులోనే జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించి ఐదో రోజు పర్యటనను ముగించారు. మొత్తం మీద ప్రొద్దుటూరు పర్యటనలో జగన్ ఫుల్లుగా ఖుషీ అయినట్లు మొహంలోనే తెలిసిపోతోంది.

 

loader